మోడీ నా మజాకా! ... అసదుద్దీన్ తో ఆ పనిచేయించారు

August 03, 2020

హైదరాబాదులో, తెలంగాణలో చాలా మందికి తెలియని విషయం... ఎంఐఎం జెండా పండగను పట్టించుకోదు. దేశ వ్యాప్తంగా ముస్లింలతో సహా ప్రతి ఒక్కరు జాతీయ జెండాను గౌరవిస్తారు. కానీ ఎంఐఎం పార్టీ మాత్రం భారతీయ జెండాను, జాతీయ గీతాన్ని పట్టించుకునేది కాదు. వారు దీనిని అసలు సెలబ్రేట్ చేసేవారని కాదని చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది కేవలం పాతబస్తీలో మాత్రమే కనిపించే సంప్రదాయం. దీనికి కారణం... అసదుద్దీన్ కుటుంబం. పాతబస్తీలో ముస్లింలందరూ ఆ కుటుంబానికి అభిమానులు. బేసిగ్గా ఇండియాలో ఉన్న ప్రతిఒక్కరు జాతీయ జెండాను ఎంతో ప్రేమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అది కనిపించేది కాదు.

అయితే, 2014లో మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అది పతాక స్థాయికి చేరింది. ఎన్నడూ లేనిది తాను భారతీయుడు అని చెప్పుకోవడానికి అసదుద్దీన్ ఒవైసీ ఉబలాటపడుతున్నారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన సీఏఏ చట్టం, ఎన్నార్సీ వల్ల దారుస్సలాంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశం పట్ల ప్రేమను వ్యక్తంచేయకపోతే తప్పనిసరి పరిస్థితిని మోడీ షాలు ఎంఐఎం పార్టీకి కల్పించారు. దీంతో స్వయంగా అసుదుద్దీన్ ఒవైసీ ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఇది మోడీ బీజేపీ విజయం కిందే లెక్క. 

ఎన్నికల సమయంలో తప్ప ఎపుడూ బహిరంగ రాజకీయ సమావేశాలు పెట్టని అసుదుద్దీన్ నిన్న ఎంఐఎం హెడ్ క్వార్టర్ దారుస్సలాలంలో భారీ సభ పెట్టారు. ప్రతి ముస్లిం తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అసద్ పిలుపు అందుకుని పాత బస్తీ త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. ఏ ఇంటిపై చూసినా జాతీయ జెండా కనిపించింది. ఇది హైదరాబాదులోని పాతబస్తీలో చాలా అరుదైన సీన్. సభలో అసద్ మాట్లాడుతూ.. మ ా దేశభక్తిని పదేపదే నిరూపించుకోవాలని దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశానికి కులమతాలు ఏమీ లేవు. కాకపోతే జాతీయ భావం, కన్నభూమి పట్ల ప్రేమ ప్రతి ఒక్కరూ పుట్టుకతో చూపాలి. అది ధర్మం. ఇన్నాళ్లకు అయినా... పాతబస్తీ త్రివర్ణ మయం అయిందంటే.. అది కచ్చితంగా బీజేపీ విజయమే అని తెలంగాణ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

వీడియో లింకు : https://twitter.com/i/status/1208377192159137794