నానావతి హాస్పిటల్‌లో ఐశ్వర్య రాయ్ పరిస్థితి ఏంటి

August 07, 2020

స్వల్ప లక్షణాలతో ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యలకు కరోనా లక్షణాలు పెరగడంతో ఆస్పత్రికి తరలించారు.

చికిత్స తీసుకుంటున్నా లక్షణాలు పెరుగుతూనే ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మామ, భర్త చికిత్స పొందుతున్న నానావతి ఆస్పత్రికి తరలించారు.

ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలు ఇద్దరికీ నాలుగు రోజుల కింద కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

ఒక రోజు ముందు అమితాబ్ బచ్చన్ కి నిర్దారణ అయ్యింది.  వాళ్లు తొలిరోజే హాస్పిటల్‌లో చేరారు. ఐశ్వర్యారాయ్, ఆరాధ్యకు స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల హోం ఐసోలేషన్ చికిత్స ఇస్తున్నారు.

పరిస్థితి తీవ్రం కావడంతో తాజాగా ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఆస్పత్రికి తరలించడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది.

 ప్రస్తుతం మామ అమితాబ్, భర్త అభిషేక్ చికిత్స పొందుతున్న నానావతిలోనే ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు చికిత్స తీసుకుంటున్నారు.

ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువుంది. మరణాల రేటు కూడా ఎక్కువే.

దేశంతో పోలిస్తే ఇక్కడ రికవరీ రేటు కూడా తక్కువ ఉండటమే అభిమానుల ఆందోళనకు కారణం.