ఐశ్వర్య రాయ్‌కు, ఆరాధ్యకు కరోనా !

August 07, 2020

ఐశ్వర్య రాయ్‌కు కూడా కరోనా సోకిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ప్రకటించారు. ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్య అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా టెస్టుల్లో నిర్ధరణ అయిందని ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఆమె భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్‌లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా జయా బచ్చన్‌కు టెస్ట్ రిజల్ట్ నెగటివ్ వచ్చిందని రాజేశ్ తోపె ట్వీట్ చేశారు.

అయితే కొద్ది సేపటికే ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ట్వీట్ చేసిన ఆయన కొద్దిసేపటికే దాన్ని తొలగించారు. కోవిడ్ బాధితులు ఎవరికి వారు తమ ఐడెంటిటీని బయటపెట్టుకోవచ్చు కాని ఇతరులు బయటపెట్టడం నేరం. అందుకే ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు.

ఇదిలా ఉండగా... చిన్నారి ఆరాధ్యకు, ఐష్ కు కోవిడ్ రావడం అభిమానులను కలచివేస్తోంది. అదృష్టవశాత్తూ అందరికీ మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి. బాలీవుడ్ వారి క్షేమం కోసం ప్రార్థిస్తోంది. తెలుగు సినీలోకం మొత్తం వీరి ఆరోగ్యం కోసం పరితపిస్తోంది.  పలువురు ప్రముఖులు బిగ్ బి కోలుకోవాలని ట్వీట్లు వేస్తున్నారు.