అజయ్ కల్లం రెడ్డి... అవుట్, ఎందుకు పీకేశారు?

August 14, 2020

సలహాదారులు రాజకీయ నాయకుల్లా ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం జగన్ హయాంలో కొత్త ట్రెండ్. అసలు జగన్ కోసం గొంతుకోసుకోవడానికి అయినా రెడీగా ఉన్నారా అనేంతగా ఐఏఎస్ అధికారులు ఎగబడ్డారు. అలాంటి సమయంలో ఏకంగా జగన్ తెచ్చిన పక్కనే కూర్చోబెట్టుకున్న కుడిభుజం లాంటి అజయ్ కల్లం రెడ్డి పోస్టు ఊడిపోవడం, ఆయన కు ఉన్న అధికారాలు కోల్పోవడం ఏపీ లో కలకలం రేపింది. అజయ్ కల్లం రెడ్డికే నేడు ఇలాంటి పరిస్థితి వస్తే... భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటి? అనే ఒక కొత్త చర్చ అధికారుల్లో మొదలైందని చెబుతున్నారు.

ఎవరీ అజయ్ కల్లం రెడ్డి

అజయ్ కల్లం రెడ్డి. మునుపు ఈ రెడ్డి ట్యాగ్ దాచేవారు. అదేంటో వైఎస్ హయాంలో కూడా దాచారు. జగన్ వచ్చాక దానిని ఆయనే చెప్పుకున్నారు. నిన్నటివరకు ఆయన సీఎంఓ లో సూపర్ బాస్. అత్యంత కీలక అధికారి. ఎన్నికల ముందు నుండి జగన్ వెన్నంటి ఉన్నందుకు, తండ్రి రాజశేఖర్ రెడ్డి వద్ద కూడా పని చేసిన అనుభవం ఉంది. అందువల్ల అజయ్ రిటైర్ అయినప్పటికీ... ముఖ్యసలహాదారుగా నియమించుకున్నారు. అంతేకాదు అనేక శాఖలకు బాస్ ని చేశారు. నిన్న సడెన్ గా సీఎంవో సబ్జెక్ట్ ల జాబితాలో అజయ్ కల్లాం పేరు లేకుండా పోయింది. 

సీఎంఓలో జరిగిన మార్పులు ఏంటి?

సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళిని సీఎం జగన్ తప్పించారు.  ఆ ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయించారు. జగన్ ఫేవరెట్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కి  జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్ బాధ్యతలు అప్పగించారు. సాల్మన్ ఆరోఖ్య రాజ్ కి రవాణా, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖలు అప్పగించారు. ధనుంజయ్ రెడ్డి కి జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖలు అప్పగించారు.

మార్పుల వెనుక ఏం జరిగింది?

సంచలనం అయిన ఈ మార్పుల వెనుక చాలా పెద్ద రాజకీయం ఉంది. జగన్ రెడ్డి, క్రిస్టియన్ ట్యాగ్స్ వాడి, కులాభిమానం చూపినట్టు కనిపించినా... జగన్ ఫస్ట్ ప్రియారిటీ ఎపుడూ పదవి, వ్యాపారమే. దానికి ఉపయోగపడకపోతే సొంత వారికి ఈ పరిస్థితి తప్పదు. తనకు ఉపయోగపడకపోతే ఏ కులమైనా వేటేయడమే. విచిత్రం ఏంటంటే... తాజా మార్పులు  ఆర్డర్ కాపీ వచ్చే వరకూ అజయ్ కల్లాం, పీవీ రమేష్ కు కూడా తెలియకపోవడం.  మొన్నటి వరకు సూపర్ బాస్ గా వెలుగొందిన అజయ్ మాటే సీఎంఓ లో శాసనం. ఇపుడు అంతా శూన్యం.

ఎమ్మెల్యేలకు తనను కలిసేందుకు జగన్ రోజు కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు చెప్పారు. రఘురామరాజు కంప్లయింట్ల తర్వాత ఇది పెరిగింది. అయితే...  ఎమ్మెల్యేలు సలహాదారుల విషయంలో తెగ కంప్లయింట్లు చేశారట. పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినట్టు తెలిసింది. ఈ అధికారుల కూటమి ఒక లాబీలా తయారయ్యిందని వారు ఆరోపించారట.  దానికి తోడుగా అనేక కార్యక్రమాల్లో అజయ్ కల్లాం సహా రమేష్ వంటి వారు వేళ్ళు పెడుతున్నట్టుగా జగన్ కి ఫిర్యాదులు వచ్చాయట.  జగన్ ఫేవరెట్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలను కూడా అజయ్ కల్లాం పక్కకు పెట్టడం, వాటిని కూడా కొన్నిసార్లు వ్యతిరేకించడంతో జగన్ ప్రేమను కల్లం కోల్పోయాడు.