అంబానీ కొడుకు భలే మార్కులు కొట్టేశాడే

June 03, 2020

అంబానీ కొడుకు పెద్ద మనసు చాటుకున్నారు. సోషల్ మీడియాలో హీరో అయ్యారు. అరె ఇతని ఆట్యిట్యూడ్ బాగుందే అని అనేక మందితో ప్రశంసలు పొందారు. ఇంతకీ ఏం జరిగింది అనే ఉత్సకత వచ్చిందిగా మీకు... రండి తెలుసుకుందాం.

భారతదేశపు నెం.1 కుబేరుడు ముఖేశ్ అంబానీ సుపుత్రుడు కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్తున్నాడు. ముంబయి రోడ్లపై తన కాన్వాయ్ తో వెళ్తుండగా.... రోడ్డుపై ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి తీవ్ర గాయాలతో కింద పడ్డాడు. దానిని గమనించి వెంటనే తమ కాన్వాయ్ ని ఆపించిన ముఖేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ బాధితుడిని తన కాన్వాయ్ లోని ఓ కారులో ఎక్కించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. లక్ష కోట్ల సంపన్నుడి పెద్ద మనసుకు అక్కడున్న వారు ఎంతో సంతోషించారు. అతని మానవీయతను ప్రశంచించారు.

వాస్తవానికి ఆ ప్రమాదం జరిగి అప్పటికే కొద్దిసేపు అయ్యింది. ట్రాఫిక్ వల్ల అంబులెన్సు కూడా సమయానికి రాలేదు. ఆ మహా నగరంలో ఎవరూ అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో గాయాలతో బాధితుడు తీవ్ర వేదన అనుభవిస్తుండగా... ఆకాష్ కంట్లో పడింది ఈ ఘటన. వెంటనే స్పందించారు. అంబానీల కుటుంబానికి ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను ఇచ్చింది. ఆ ప్రొటోకాల్ ను అధిగమించి తనిఖీలు లేని చోట వాహనం ఆపేయించారు. ఈ సంఘటన మొత్తం అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఈ సంఘటన జరిగి మూడునాలుగు రోజులైంది. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతోంది.