​అక్కినేని ఫ్యామిలీ చివరకు హీరోయిన్ మీద ఆధారపడింది

August 14, 2020

అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ ను తట్టుకున్న దేవదాసుగా నిలిస్తే... అమ్మాయిల మనసుదోచిన మన్మథుడిగా అక్కినేని నాగార్జున ​నిలిచారు. ఇక మూడో తరంలో ఇత్తరు హీరోలు వచ్చినా... సినిమా రిలీజ్ కు ముందే అందరిలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అఖిల్ మాత్రం... మొదటి సినిమాతో తుస్సుమన్నాడు. రెండు మూడు సినిమాలు కూడా ఫ్లాపే. దీంతో అక్కినేని ఫ్యామిలీ కలతకు గురయ్యింది. మరోప్రయత్నం మొదలుపెట్టింది.

అఖిల్ నాలుగో సినిమా అయినా జాగ్రత్త పడతారు అనుకుంటూ వారు బాగా కన్ఫూజ్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అవుట్ డేటెడ్ దర్శకుడిగా మారిపోయిన బొమ్మరిల్లు దర్శకుడికి ఛాన్సిచ్చారు. టైటిల్ కూడా ఎ క్లాస్ కే ఎక్కుతుంది. మరి సినిమా ఎలా ఆడుతుంది? ఇదేం సెలెక్షన్... అంటే పూజా హెగ్డే సెంటిమెంట్ గురించి చెబుతున్నారు. 

పూజా హెగ్డే ఏ సినిమా చేసిన హిట్టే. ఆమె అన్ని సినిమాలు హిట్ కాబట్ట ిఅఖిల్ సినిమాలో ఆమెను పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా హిట్టయిపోతుంది అంటూ అఖిల్ ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు. పాపం అఖిల్.