సుబ్బారెడ్డి హత్యకు భూమ అఖిల కుట్ర... సంచలన ఆరోపణ

August 07, 2020

కర్నూలు జిల్లా తెలుగుదేశం నేత ఏవీ సుబ్బారెడ్డి​ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి మరో తెలుగుదేశం నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రాముడితో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా విలేకరులతో వెల్లడించారు. ఈ హత్యకు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నది కూడా చెప్పారు. 'రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్‌ సంజోరెడ్డిల సహకారంతో అఖిలప్రియ ఈ హత్యకు ప్రణాళిక రచించిందని ఆయన అన్నారు. ఈ హత్య చేయడానికి నిందితులు కోటి రూపాయలు డిమాండ్ చేస్తే చివరకు బేరమాడి రూ.50 లక్షల సుఫారీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

ఈ కుట్రను భగం చేసి కడప పోలీసులు తనను కాపాడారని... వారికి నా హృదయపూర్వక కృతజ్జతలు అని చెప్పారు.  సుపారీ డబ్బులను భూమా అఖిలప్రియ అనుచరుడు మాదా శ్రీను ఇచ్చాడని నిందితులు చెప్పారన్నారు. 

ఈ హత్య ప్రణాళిక వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. అఖిలప్రియ నా హత్యకు ప్రణాళిక రచించడం ఘోరమని,  ఈ విషయాన్ని మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను అని సుబ్బారెడ్డి చెప్పారు. తక్షణమే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడిని అరెస్ట్‌ చేయాలి అని సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.​

ఇంతకీ ఏం జరిగింది?

సుబ్బారెడ్డి హత్యకు ఒక ముఠా ప్రయత్నించింది. దీనిపై కడప చిన్న చౌక్ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. మార్చి నుంచి ఈ తతంగం సాగుతోంది. పోలీసులు అరెస్టు చేసిన ఆ ముఠా నుంచి 3.20 లక్షల నగదు, పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారి మాదా శ్రీనివాసును పోలీసులు అరెస్టు చేశారు?

ఎవరీ సుబ్బారెడ్డి?

 

ఏవీ సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడు. నాగిరెడ్డి చనిపోయాక... కుటుంబంతో సుబ్బారెడ్డికి సంబంధాలు తెగిపోయాయి. ఇద్దరు టీడీపీలోనే ఉన్నా వేర్వేరు వర్గాలుగా తిరుగుతున్నారు. ఎన్నికలపుడు చంద్రబాబు ఇద్దరినీ కలిసి పనిచేయమని చెప్పారు. అయినా వారి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయింది. అసలు అఖిలకు సీటు ఇవ్వడమే సుబ్బారెడ్డికి నచ్చలేదు.