అల వైకుంఠపురంలో జెమిని ఎందుకు వాయిదావేసింది

August 07, 2020

ఒకట్రెండు రోజుల నుంచి అల వైకుంఠపురంలో టీవీలో వస్తున్నట్లు ప్రకటన రాగానే బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదే టాపిక్ ను ట్రెండ్ చేస్తున్నారు. 2020లో ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లో ఇదే బిగ్ హిట్. అల్లు అర్జున్ కెరీర్ ను చాలా పైకి లేపిందీ సినిమా. దీంతో సుకుమార్ పుష్ప సినిమా మార్కెట్ మరింత పెరిగినట్లయ్యింది. ఇక పోతే అతిత్వరలో అల వైకుంఠపురంలో సినిమా టీవీలో వేస్తున్నారని తెలుసుగానీ... ఎపుడునే విషయం తాజాగా తేలింది.

బన్నీ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8 న వేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటికే జెమిని తన వీకెండ్ సినిమాలు అన్నీ డిసైడ్ చేయడం వల్ల అల సినిమాను మే 1 కి షెడ్యూల్ చేశారని బయట వార్తలు వస్తున్నాయి. అయితే... లాక్ డౌన్ లో వేస్తే యాడ్ రెవెన్యూ అనుకున్నంత రాకపోవడం వల్ల దానిని పోస్ట్ పోన్ చేశారని మరో వాదన. 

ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అజ్జాత వాసితో పరువు పోగొట్టుకున్న త్రివిక్రమ్ అరవిందసమేత వీర రాఘవతో కొంచెం పుంజుకున్నారు. అలవైకుంఠపురం సినిమాతో మళ్లీ తన స్టామినా నిలబెట్టుకున్నారు. ఇందులో పాటలు సినిమాను బాగా లేపాయి.