అలీ... జ‌గ‌న్ ని న‌మ్మాడు ... నిండా మునిగాడు

July 03, 2020

పాపం అలీ... రాష్ట్రంలో పాపుల‌ర్ న‌టుడు. కానీ రాజ‌కీయాలు ఎలా చేయ‌కూడ‌దో అన్న‌దానికి ఇపుడు ప‌క్కా ఎగ్జాంపుల్‌గా మారాడు. నా రేంజికి మినిమ‌మ్ మంత్రి పోస్టు కావాల‌ని తెగ ఉబ‌లాట‌ప‌డ్డాడు. ఏకంగా పార్టీ అధ్య‌క్షుల‌ను క‌లిశాడు. ల‌లితా జువెలర్స్ గుండ్ బాస్‌ని అచ్చంగా ఫాలో అయిపోయాడు... అన్ని పార్టీ తిరిగి కంపేర్ చేసి అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. రాష్ట్రంలో అలీ గురించి టాక్ ఏంటో తెలుసా.... **ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండానే ఈ స్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని, క్రెడిబిలిటీ కోల్పోయిన వ్యక్తి అలీకి మించి మరొకరు లేరు**
అలీ వైసీపీలో చేర‌డానికి కొద్దిరోజుల ముందే అలీ స‌త్కార స‌భ‌కు వెళ్లాడు. దానికి హాజ‌ర‌యిన చంద్ర‌బాబు అలీని స‌త్క‌రించి ఎంతో గౌర‌వించాడు. అపుడు చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే...
**అన్ని తరాల నటులకు అలీ స్ఫూర్తిగా నిలుస్తారు. నటుడు అలీ ఈస్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. పేద కుటుంబంలో పుట్టినా .. కష్టపడి, అంచెలంచెలుగా ఎదిగారు. సినిమాల్లో హీరో ఎంతముఖ్యమో, హాస్య నటులు అంతే ముఖ్యం. 40 ఏళ్ల సినీ జీవితంలో అలీ ఎంతో కష్టపడ్డారు. ఓ మంచి వ్యక్తిని అభినందించాలన్న ఉద్దేశంతో తాను కూడా భాగస్వామిని కావాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి హాజర‌య్యాను. అలీ నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి. జీవితంలో రిలాక్సేషన్స్ రావాలంటే అలీ లాంటి వ్యక్తులు ఎంతో అవసరం. అలీకి వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులకు అభినందనలు.**
ఇది చంద్ర‌బాబు అలీకి ఇచ్చిన గౌర‌వం. రాజ‌కీయాల్లోకి రావాల‌న్న అత‌ని కోరిక‌ను అభినందిస్తూ చంద్ర‌బాబు ప్రోత్స‌హిద్దామ‌ని ప్ర‌య‌త్నం చేస్తే... అత‌న్ని వైసీపీ ట్రాప్ చేసింది. ఆ స‌క్సెస్‌ఫుల్ ట్రాప్‌లో అలీ ప‌డ్డారు. వైసీపీ వాళ్ల‌కు అలీని తీసుకుందామ‌ని కాదు, టీడీపీలో చేర‌కుండా చేయాల‌న్న‌ది ల‌క్ష్యం. వారి ల‌క్ష్యం నెర‌వేరింది. అలీని ప‌క్క‌న పెట్టేశారు. ఈ మ‌నోవేద‌న‌ను పంచుకుందామ‌ని ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు ప‌వ‌న్‌ని క‌లిశాడ‌ట ఆలీ. అన్నీ మాట్లాడి మొహం చెల్ల‌క తిరిగి వ‌చ్చేశాడ‌ట‌.
వైసీపీ త‌ప్ప ఏపీలో ఇంకే పార్టీలో చేరినా అలీ ఇంత ప‌త‌నం అయ్యేవాడు కాదు. చివ‌ర‌కు బీజేపీలో చేరినా గెలిచేవాడు. అలాంటిది వైసీపీ ఉచ్చులో చిక్క‌కుని విల‌విల్లాడుతున్నాడు. వాస్త‌వానికి అత‌ను క‌నీసం జ‌న‌సేన‌లో చేరి ఉన్నా అత‌నికి ఉన్న పాపులారిటీకి, మాట‌కారి త‌నానికి , అత‌ను చేసిన సేవ‌కు క‌చ్చితంగా ఎమ్మెల్యే అయ్యేవాడు. ప‌వ‌న్ క్రేజు, జ‌నసేన అభిమానుల అండ‌, కాపు సామాజిక వ‌ర్గంతో పాటు ముస్లింల మ‌ద్ద‌తు ఆలీకి పుష్క‌లంగా ఉండేది. దీంతో క‌చ్చితంగా గెలిచేవాడు. కానీ బంగారు భ‌విష్య‌త్తును వైసీపీ కొట్టులో తాక‌ట్టుపెట్టి ఇపుడు ఎటూ తేల్చుకోలేక త‌న ఐదేళ్ల రాజ‌కీయ జీవితాన్ని వృథా చేసుకున్నాడు. 2024లో రైతెవ‌రో రాజెవ‌రో?