టచ్ చేయకూడని చోట టచ్ చేసిన అలీ

August 03, 2020

బిగ్ బాస్ 3 వినోదాన్ని అందించటం వదిలేసి.. వయలెంట్ గా మారిపోతున్న తీరు ఆందోళన కలిగించేలా ఉంది. ఎంత కెప్టెన్ టాస్క్ అయితే మాత్రం ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించటమా? అన్నది ప్రశ్నగా మారింది. ఎంత డబ్బులు ఇవ్వకపోతే మాత్రం.. ఒక అమ్మాయి షర్ట్ జేబులో చేతులు పెట్టేసి.. డబ్బులు తీసేసుకునే ప్రయత్నాన్ని ఊహించగలమా? ఎంత ఆట అయితే మాత్రం హద్దులు దాటేయటం ఒక ఎత్తు.. భౌతిక దాడులకు సైతం వెనుకాడకపోవటం మరో వైనంగా చెప్పాలి. మొహమాటపు పరదాల్ని ఎప్పుడూ తీసి పారేసిన బిగ్ బాస్ హౌస్ మేట్స్.. గెలుపు మాత్రమే తప్పించి మిగిలినవేమీ తమకు అక్కర్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ప్రేక్షకులకు ఇప్పుడు షాకింగ్ గా మారిందని చెప్పకతప్పదు.
బుధవారం ఎపిసోడ్ నే చూస్తే.. కెప్టెన్ టాస్క్ లో భాగంగా గేమ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టాలన్న వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. బిగ్ బాస్ పెట్టిన పుల్లకు ఇంటి సభ్యులు చెలరేగిపోయారు. ఇందులో భాగంగా చోటు చేసుకున్న రచ్చ చూసిన వారికి.. ఎంత ఆట అయితే మాత్రం మరీ ఇంత పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.
బిగ్ బాస్ ఇచ్చిన నిధి టాస్క్ లో నిధిని దొంగలించాలనుకున్న బ్యాచ్ ఒకరైతే.. వాటిని రక్షించుకునేబ్యాచ్ మరొకటి. ఇదొకటైతే.. ఇంట్లో నీళ్లు తాగటానికి వెళ్లిన హిమజను అలీ డబ్బులు అడగటం.. ఆ సందర్భంగా వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇది శ్రుతిమించి భౌతికదాడుల వరకూ వెళ్లటం గమనార్హం. ఇంట్లో నీళ్లు తాగటానికి వెళ్లిన హిమజను డబ్బులు అడిగిన అలీకి డబ్బులు ఇవ్వలేదు.
రెండోసారి మళ్లీ తాగే ప్రయత్నం చేయటం.. ఆమె నుంచి డబ్బులు వసూలు చేసే క్రమంలో హిమజ జేబులో చేయి పెట్టి డబ్బులు లాక్కుంటూ ఆమెపై భౌతిక దాడి చేసే ప్రయత్నం చేశారు అలీ. ఈ సందర్భంగా డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అంటూ.. అతడి ముఖం మీద కొట్టేసింది హిమజ. డబ్బులు కావాలంటే ఇస్తా కానీ అలా టచ్ చేయమాకంటూ హిమజ సీరియస్ కామెంట్ చేయటంతో అలీ కోపంతో ఊగిపోయాడు. నువ్వు నా ముఖం మీద కొట్టేస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. నా ముఖం మీద కొడతావా? నిన్ను కొడతా అంటూ హిమజపై దూసుకెళ్లాడు. దీనికి బదులిచ్చిన హిమజ.. నువ్వు చేతులు పెట్టావ్ కాబట్టే నిన్ను తన్నాను తప్పించి.. వ్యక్తిగతంగా చేయాలని కాదంటూ ఆమె వివరణ ఇచ్చింది.
దీనికి అలీ బదులిస్తూ.. నువ్వు వాటర్ తాగి డబ్బులు ఇవ్వకపోతే.. డబ్బులు తీసుకునే క్రమంలో ప్రయత్నం చేశానే తప్పించి మరింకేమీ లేదు.. అంత మాత్రానికే తంతావా అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా హిమజ మీద పర్సనల్ కామెంట్స్ చేశాడు. దీంతో హర్ట్ అయిన హిమజ.. తాను తన్నాలని తన్నలేదని చెప్పే ప్రయత్నం చేసి సారీ చెప్పింది. అయినా అలీ వెనక్కి తగ్గకపోవటంతో తనను క్షమించాలంటూ అతడి కాళ్ల మీద పడింది. దీనిపై మరోసారి ఆగ్రహం వ్య్తం చేశాడు అలీ. కాళ్ల మీద పడిపోయి సానుభూతి కొట్టేయాలనుకుంటున్నావా? అంటూ మండిపడ్డాడు. దీంతో భోరున విలపిస్తూ బాత్రూంలోకి వెళ్లిపోయింది హిమజ. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న తమన్నా.. కాళ్ల మీద పడి సారీ చెప్పినా క్షమించలేవా? అంటూ తనదైన ధోరణిలో మండిపడింది. నువ్వేంటి రెచ్చి పోతున్నావ్ అంటూ ఫైర్ అయ్యింది. కాసేపటికే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన హిమజ.. అలీతో కూల్ గా మాట్లాడటంతో వారి వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లైంది. ఏమైనా.. తిట్లు.. శాపనార్థాలు.. భౌతికదాడులతో బిగ్ బాస్ 3 అప్రతిహతంగా సాగిపోతోంది. కాకుంటే.. చూసే వారికే చిరాకు పుట్టించేలా ఉందన్న మాట వినిపిస్తోంది. మోతాదు మించింది ఏదైనా మొహమెత్తకుండా ఉంటుందా?