నో ప్రైవేట్... జగన్ సంచలన ఉత్తర్వులు

June 03, 2020

చాాలారోజుల నుంచి అతితక్కువ కరోనా కేసులు నమోదైన ఏపీ కాస్త నిదానంగానే నడిపింది. మొదట్లో అసలు దాని తీవ్రతను అస్సలు గుర్తించలేదు. అయితే, అదృష్టవశాత్తూ ఏపీలో అప్పటికి ఎన్నారైల రాక తక్కువగానే ఉంది. నేరుగా ప్రముఖ దేశాల నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ శంషాబాద్ కే రావడం, ఇక్కడే వారిని క్వారంటైన్ చేయడం ఏపీలో తక్కువ కేసులు నమోదుకు ఒక కారణం. 

ఇదిలా ఉంటే వారం క్రితం వరకు చాలా తక్కువగా కేసులున్న ఏపీలో గత మూడు నాలుగు రోజులుగా బాగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వంలో ఇపుడు భయం మొదలైంది. ఏపీలో అన్ని ప్రైవేటు వైద్య విభాగాలు కూడా ప్రభుత్వం కిందకే వస్తాయని.. ఏపీలో ఏ ఆస్పత్రిలో అయినా కరోనా రోగులకు చికిత్స చేసేలా ఉత్తర్వులు తెచ్చారు. అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చికిత్సలు నిర్వహిస్తారు. ప్రైవేటు లో పనిచేసే వారిని కూడా ప్రభుత్వం ఈ సేవల కోసం ఉపయోగించుకోవచ్చు. అలా  ఆ ఆదేశాలు జారీ చేశారు.

తొలి దశలో...విశాఖ, కాకినాడ, విజయవాడ, తిరుపతి మెడికల్ కాలేజీలను ఉపయోగించుకుంటారు. అవసరాన్ని బట్టి మిగతా వాటిని పొడిగిస్తారు. క్వారంటైన్ కేంద్రాలకు కొరతలేదని, ఎవరికైనా ఇళ్లలో క్వారంటైన్ సదుపాయాలు సరిగా లేకపోతే ప్రభుత్వం చేసిన చోట క్వారంటైన్ లో ఉండొచ్చని మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు.

కొసమెరుపు - ప్రైవేటు ఆస్పత్రులను వినియోగించుకోవడం గురించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ వైద్య మంత్రి కాకుండా వ్యవసాయ మంత్రి కన్నబాబు వివరించడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మొదట్నుంచి ఏపీ వైద్య మంత్రి వ్యవహారంపై అనేక అనుమానాలున్నాయి.