ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం?

May 29, 2020

అమరావతి రైతులను అవమానించింది ఎవరు? 

అమరావతి రైతులకు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు?

అమరావతిని మార్చితే నేను మొదట అడ్డుపడతా అని చెప్పి... మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందొద్దా ? అని ఫ్లేటు ఫిరాయించింది ఎవరు... 

ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన ఒక ప్రమాదంలో గాయపడ్డాటరటండీ.!

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి గ్రామంలో ఒక పెళ్లికి వెళ్లారట ఆళ్ల. అక్కడేమో సారు స్టేజిపై ఎక్కగానే స్టేజి కూలిపోయిందట. దీంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కింద పడ్డారట. ఆయన కాలికి బాగా దెబ్బ తగిలిందట. గాయాలుఅయ్యాయట. అతన్ని జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యం చేసి పెద్ద కట్టు కట్టారట. త్వరగా కోలుకుంటుంది అని చెప్పారట. ఎందుకంటే ఆయన ఏపీలోని అన్ని జిల్లాలు అమరావతితో సమంగా అభివృద్ధి చెందాలని కాంక్షించిన శాంతి కాముకుడు కదా. 

పైగా తనకు ఓటేసిన రైతులకు చెందిన అమరావతి భూములను ఇతర ప్రాంతాల రైతులకు ధారాదత్తం చేయమని జగన్ కు చెప్పడం ద్వారా అమరావతిని అన్ని ప్రాంతాల రాజధానిగా మార్చిన ఘనత సంపాదించారట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు మరి.