రాహుల్ అల‌క మిత్రులకు మంట పుట్టిస్తోంది!

July 12, 2020

ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి.. వ్య‌క్తిగ‌తంగా తాను ఫెయిల్ అయ్యానంటూ గ‌డిచిన మూడు రోజులుగా పార్టీ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించ‌ని రాహుల్ తీరు పార్టీ నేత‌ల్లోనే కాదు.. యూపీఏ కూట‌మి ప‌క్షాల అధినేత‌లు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఓట‌మి వేళ‌.. కొత్త ల‌క్ష్యాల్ని నిర్దేశించుకోవాలే త‌ప్పించి.. ఇలా వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌న్న మాట‌ను కొంద‌రు చెబుతున్నారు. కాంగ్రెస్ ను వీడిపోవాల‌న్న ఆలోచ‌న స‌రికాద‌ని.. కీల‌క బాధ్య‌త‌ల్ని చేప‌ట్టాల‌న్న మాట‌ను మిత్రులు పలువురు రాహుల్ గాంధీకి ఫోన్ చేసి బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 
ఇందిర‌మ్మ టైంలోనే తాము ధైర్యం కోల్పోలేద‌ని.. రాహుల్ ను ఇప్పుడు కూడా వెళ్ల‌నిచ్చేది లేద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత.. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. రాహుల్ కు ప్ర‌త్యామ్నాయంగా వేరే నేత‌ను వెత‌క‌లేక‌పోయామ‌ని.. గాంధీయేత‌ర నాయ‌క‌త్వం పార్టీకి స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వ‌ద‌ని స్ప‌ష్టం చేశారు
పార్టీలో ప్ర‌స్తుతం నెల‌కొన్న పరిస్థితిని  తాత్కాలిక ద‌శ‌గా క‌ర్ణాట‌క మాజీ సీఎం వీర‌ప్ప మొయిలీ అభివ‌ర్ణించ‌గా.. కాంగ్రెస్ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల సామ‌ర్థ్యం రాహుల్ కు మాత్ర‌మే ఉంద‌ని తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ స్ప‌ష్టం చేశారు. 
పార్టీకి రాహుల్ సార‌థ్యం వ‌హించాల‌ని డీఎంకే అధినేత స్టాలిన్.. ఆర్జేడీ చీఫ్ లాలూ.. ర‌జ‌నీకాంత్ తో  స‌హ ప‌లువురు నేత‌లు కోరుతున్నారు.రాహుల్ కు ఫోన్ చేస్తున్న వారు.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీ అధ్య‌క్ష స్థానాన్ని చేప‌ట్టాల‌ని.. దూరంగా ఉండ‌టం స‌రికాద‌న్న మాట‌ను చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. రాహుల్ త‌న స‌త్తా చూపించాలే కానీ వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. రాహుల్ త‌న రాజీనామా విష‌యంలో ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టం.. బీజేపీ ప‌న్నిన ఉచ్చులో చిక్కుకుపోవ‌ట‌మేనంటూ లాలూ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేత‌లు.. మిత్రులు ఇంత ఇదిగా కోరుతున్న వేళ‌.. రాహుల్ త‌న ప‌ట్టును వీడి పార్టీ నిర్వ‌హ‌ణ చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. రాహుల్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.