అల్లుఅర్జున్, స్నేహ... అక్కడ కనిపించారు

August 05, 2020

ఈ మధ్య అల్లు అర్జున్ ఖాళీ సమయాన్ని పిల్లలతో గడపుతూ భలే ఎంజాయ్ చేస్తున్నాడు. డ్యాన్సులు, కుకింగ్ లు కూతురితో రకరకాల అల్లరి చేస్తున్నాడు.

కూతురు అర్హ సరదాగా డ్యాన్స్ అదరగొట్టేసింది. నా బుజ్జి తల్లి ఒక ప్రశ్న అడగనా అంటూ పెద్ద ప్రశ్న వేశాడు అల్లు అర్జున్ తన కూతురికి.

నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లిచేసుకుంటావా అని అడిగాడు

లేదు నేను చేసుకోను అని చెప్పేసింది.

ఇంకేముంది 

నాన్నకు మండిపోయింది

గట్టిగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు

అర్హనా మజాకా?

ఇదే కదా ఇప్పటికే చాలా సార్లు అల్లు అర్జున్ కి ఝలక్ ఇచ్చింది కూతురు అర్హ.

 

ఇక ఈరోజు అల్లు అర్జున్ స్నేహలు...కేబీఆర్ పార్కులో వాక్ చేస్తూ కనిపించారు. హైదరాబాదు మొత్తం ఖాళీ అవడం, చాలామంది ఇళ్లకే పరిమితం కావడంతో పొద్దునే కేబీఆర్ పార్క్ కు వచ్చింది అల్లు అర్జున్ ఫ్యామిలీ. కపుల్ ఇద్దరు వాకింగ్ చేస్తూ కనిపించారు. ఇటీవలే అల్లు అర్జున్ తన ఇంటి వద్ద కూడా వాకింగ్ చేస్తూ తిరుగుతున్న వీడియోలను మనం గమనించాం. ఈరోజు పార్కుకు వచ్చారు.

కరోనా సాధారణ జనాలకు కష్టాలను తెస్తే సెలబ్రిటీలకు పర్సనల్ టైం బోలెడు మిగిల్చింది.