అల్లు అర్జున్...జర్నలిస్టుల కోసం ఏం చేశాడో తెలుసా?

August 06, 2020

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిలిం జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందడుగేశారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం 10 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఇటీవలే అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ సాధించారు అల్లు అర్జున్. ఈ మేరకు ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ప్రెసిడెంట్ వి.లక్ష్మీనారాయణ. అల్లు అర్జున్ ని స్వయంగా కలిసి విషెస్ చెప్పారు. ఆయన వెంట వైస్ ప్రెసిడెంట్ వై.జె.రాంబాబు, జనరల్ సెక్రటరీ నాయుడు సురేంద్ర కుమార్, జాయింట్ సెక్రటరీ జి.శ్రీనివాస్ కుమార్, ట్రెజరర్ జి.జలపతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి.రఘు, వై.రవిచంద్ర, కె.ఫణి, వి.శ్రీనివాస రావు, జి.శ్రీనివాస్ తదితరులు వెళ్లారు. 
ఈ సందర్బంగా ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్టర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కార్యక్రమాలను వారిని అడిగి తెలుసుకున్న అల్లు అర్జున్.. తన వంతుగా 10 లక్షల రూపాయలను ఆర్థిక సాయం ప్రకటించారు. మీరు చేస్తున్న పనులు బాగా నచ్చాయని, ఇది టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అమౌంట్ మాత్రమే అని అన్నారు అల్లు అర్జున్. అంతేకాదు ఇకముందు కూడా మీకు కావాల్సిన సహాయం చేస్తానని మాటిచ్చారు. మీకున్న పవర్ చాలా పెద్దది. ఇండస్ట్రీలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మీరంతా ఒకటే అని చూపించాలని తెలిపారు బన్నీ.