‘సామజవరగమన‘ ప్రోమోలో ఈ పాయింట్ గమనించారా?

June 01, 2020

మోస్ట్ ఎవైటింగ్ వీడియో సాంగ్ సామజవరగమన నిరీక్షణ ఈ రోజుతో తీరినట్లే. న్యూఇయర్ కానుకగా యాభై తొమ్మిది సెకన్ల నిడివి ఉన్న వీడియో క్లిప్ ను విడుదల చేశారు. బన్నీ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. ఈ పాటను అభిమానించే కోట్లాది మందికి ఈ వీడియో క్లిప్ తో తెగ సంతోషపడిపోతారంతే. నిమిషం కంటే ఒక్క సెకను తక్కువ నిడివి ఉన్న ఈ క్లిప్ ను ఒక్కసారి చూస్తే సరిపోదు. అదే పనిగా ఐదారుసార్లు చూస్తే కానీ కాస్తంత తృప్తి.
వంక పెట్టలేని రీతిలో ఈ పాట చిత్రీకరణ ఉందనటంలో సందేహం లేదు. కాకుంటే.. బన్నీ లుక్స్ విషయంలోనే ఇబ్బంది అంతా. తళతళ మెరిసిపోయే పూజాహెగ్డే ముందు బన్నీ సరిపోయినా.. ఎందుకో తెలీదు కానీ ముఖం డల్ గా ఉండటం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా విడుదల చేసిన క్లిప్ లో.. థిక్ ఎల్లో కలర్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకున్న షాట్ లో బన్నీ ముఖంలో కనిపించిన గ్లో.. మిగిలిన షాట్స్ లో కనిపించకపోవటం విశేషం.
లైటింగ్ దెబ్బేసిందా? మేకప్ విషయంలో తేడా కొట్టిందా? బ్యాక్ గ్రౌండ్ కి.. లైటింగ్ కి.. బన్నీ క్యాస్టూమ్స్ తో పాటు.. లాంగ్ షాట్స్ కారణంగా ముఖంలో కళ మిస్ అయినట్లుగా చూస్తే.. ఇంత మంచి పాటకు.. బన్నీ లుక్స్ విషయంలో మరింతజాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగక మానదు. లోపాలు వెతకినట్లు కాకుండా.. సాపేక్షంగా మరోసారి క్లిప్ చూస్తే.. విషయం ఇట్టే బోధ పడుతుంది.
చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద వస్తున్నప్పుడు.. సామజవరగమన లాంటి పాట పడిన వేళ.. స్క్రీన్ మీద కనిపించే ముఖంలో గ్లో చాలా ముఖ్యం కదా? అదెందుకు మిస్ అయ్యింది. కాకుంటే.. తన ఎనర్జీ లెవల్ తో బన్నీ కట్టిపారేయటం బాగానే ఉన్నా..ముఖం డల్ గా కనిపించకుండా మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పక తప్పదు.