అల్లు అర్జున్ ప్లాన్ అదిరిపోలా? !!

August 09, 2020

అనుకోని ఉపద్రవం వచ్చి పడినప్పుడు పెద్ద మనసున్న వారు ముందుకు వచ్చి విరాళాన్ని ప్రకటించటం అలవాటే. కరోనా మహమ్మారి మీద గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనన్ని విచిత్ర పరిస్థితులు ఇప్పుడు చోటు చేసుకున్నాయి. యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండిపోయింది. పేదలతో పాటు.. కరోనాకు వ్యతిరేకంగా ఫైట్ చేయటానికి భారీ ఎత్తున నిధులు అవసరం.
ఈ నేపథ్యంలో పలువురు సినీ నటులు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు కొందరు ప్రకటిస్తుంటే.. మరికొందరు.. రెండు తెలుగురాష్ట్రాలతో పాటు.. కేంద్రానికి కూడా విరాళాల్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకూ విరాళాలు ప్రకటించిన వారిలో ప్రభాస్ అత్యధిక మొత్తాన్ని ప్రకటించారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. మరో కొత్త ట్రెండ్ కు తెర తీశారు బన్నీ.
కరోనా వేళ.. సాయం చేయటానికి కాస్త ఆలస్యంగా ముందుకు వచ్చిన ఆయన.. రూ.1.25కోట్ల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. తాను ఇస్తున్న విరాళం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కేరళ రాష్ట్రానికి కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. మలయాళంలోనూ అల్లు అర్జున్ కు మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను అభిమానించే వారి గురించి తాను ఆలోచిస్తుంటానన్న విషయాన్ని తన విరాళంతో స్పష్టం చేశారని చెప్పాలి. ఇంతకూ.. తెలుగు రాష్ట్రాలకు బన్నీ ఇస్తున్న విరాళం ఎంత? కేరళకు ఇస్తుందన్నది ఎంతన్న బ్రేకప్ మీద మాత్రం క్లారిటీ రాలేదు.