అఖిల్‌ను గోకుతున్న పూజా హెగ్డే

August 07, 2020

టాలీవుడ్లో పెద్ద సినిమా కుటుంబం నుంచి వచ్చినా ఒక్క సక్సెస్ ఒక్క సక్సెస్ అంటూ పాపం అఖిల్ అర్రులు చాస్తున్నారు.

అందగాడు అయినా, భారీ బడ్జెట్లు, స్టార్ హీరోయిన్లను దింపినా అఖిల్ సుడి తిరగలేదు. ఇప్పటికీ అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్లున్నాడు అఖిల్.

ఫెయిల్యూర్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తెరకెక్కిస్తున్నారు.

అటు దర్శకుడు, ఇటు హీరో ఇద్దరిదీ విజయం కోసం ఆరాటమే. 

అయితే, ఈ సినిమాకు పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంచుకుని నిర్మాతలు ఆశ్చర్యపరిచారు.

యాజిటీజ్ గా సక్సెస్ ఫుల్ హీరోయిన్  సెంటిమెంట్ ను ఇప్పటికే నమ్ముకోవడం ఒక విచిత్రం అయితే... తనకంటే 4 సంవత్సరాల పెద్దది అయిన హీరోయిన్ ని అఖిల్ కోసం ఎంచుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో పూజా హెగ్డే ట్రెండింగ్ హీరోయిన్. ఇటీవలే అఖిల్ వదిన సమంతపై డ్యామేజింగ్ కామెంట్లు చేసిందని సమంత ఫ్యాన్స్ పూజ మీద పెద్ద యుద్ధమే చేశారు.

కానీ అఖిల్ మాత్రం నాకు సక్సెస్ కావాలి, ఏది ఏమైనా పర్లేదంటున్నాడు. 

ఆ సారైనా అఖిల్ కు కరోనాని లెక్కచేయకుండా హగ్ ఇస్తుందా... లేదా అఖిల్ తో సక్సెస్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తుందా అన్నది చూడాలి.