అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు పోలేదు?

June 02, 2020

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేరళలో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. అయితే... తొలి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తిచేయాల్సి ఉన్నా కూడా అల్లు అర్జున్ కారణంగా వాటిని వదిలేసి మిగతా సీన్లను చిత్రీకరించారు. అధికారికంగా మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందని చెబుతున్నా... కొన్ని మొదటి షెడ్యూల్ సీన్లు ఇంకా పెండింగ్ ఉన్నట్లు సమాచారం. దీనికి కారణం అల్లు అర్జున్.

అల వైకంఠపురం సంక్రాంతికి రానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ పనులపై బిజీగా ఉన్నారు. వాస్తవానికి నవంబరు, డిసెంబరు నెలల్లో కొన్ని సీన్లకు అల్లు అర్జున్ రావాల్సి ఉన్నా అనుకోని పరిస్థితుల్లో రాలేకపోయారు. అయితే సామరస్యాంగానే ఈ సమస్యను పరిష్కరించుకున్నారు అల్లు - సుకుమార్. అందుకే అల్లు లేని సీన్లను ప్లాన్ చేసి మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. మొదటి షెడ్యూల్లో అల్లు అర్జున్ ఉన్న సీన్లను రెండో షెడ్యూల్లోకి మార్చేశారు. రెండో షెడ్యూల్ కూడా కేరళలోనే జరగనుంది. సంక్రాంతి తర్వాత ఇది ప్రారంభం కానుంది. ఇప్పటికే అల్లు అర్జున్ సుకుమార్ తో ఆర్య సిరీస్ తీశాడు. అల్లు స్టైలు, సుకుమార్ లెక్కలు కలిస్తే అది కూడా మాస్ కమర్షియల్ అయితే... అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. అందుకే సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది.