Exclusive: అల్లు అర్జున్ పుష్ప పోస్టరు వెనుక కథ

August 09, 2020

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేశారు. అల్లు అర్జున్ మాస్ లుక్ లో అందరినీ విస్మయపరిచాడు. మొన్న విడుదలైన అల వైకుంఠపురంలో వేషానికి ఇది పూర్తిగా భిన్నమైన పాత్ర. టైటిల్ ’పుష్ప‘ అని పెట్టారు. ఇందులో అల్లు అర్జున్ పోలీసులకు ఎర్ర చందనం దుంగలతో దొరికిపోయినట్లు స్టిల్ విడుదల చేశారు. రహస్యం ఏంటంటే... ఇందులో అల్లు అర్జున పాత్ర నెగెటివ్ షేడ్ తో ఉంటుంది. అల్లు అర్జున్ ఒక ఎర్రచందనం దొంగ. తిరుమల కొండల్లో ఎర్రచందనం దుంగలు నరకడం, వాటిని లారీల్లో స్మగుల్ చేయడంతో అతని పాత్ర మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే... ఇందులో అల్లు అర్జున్ బాల్యం కూడా ఉంటుంది. అతని చిన్నప్పటి నుంచే కథ మొదలవుతుంది. 

ఈ కథకు తొలుత మహేష్ బాబు ను ఎంచుకున్న సుకుమార్ మహేష్ హ్యాండ్ ఇవ్వడంతో అల్లు అర్జున్ ను ఒప్పించారు. ఒకందుకు ఇది మంచిదే అయ్యింది. ఇలాంటి నెగెటివ్ షేడ్ పాత్రను అల్లు అర్జునే మహేష్ కన్నా బాగా పండించగలరు. మిల్క్ బాయ్ మహేష్ కు ఇది అంత సూటయ్యే పాత్ర కూడా కాదు. దీనికి చాలా మేకోవర్ కావల్సి ఉంటుంది. ఫస్ట్ లుక్ చేశాక బహుశా మహేష్ బాబు, సుకుమార్ కూడా అల్లు అర్జునే బెటర్ అనుకుని ఉంటారేమో. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు అయ్యింది గానీ హీరో షాట్లు ఇంకేవీ తీయేలేదు. కేవలం ఫస్ట్ లుక్ ఫొటో షూట్స్ మాత్రమే తీశారు. ఇక పోతే... సినిమాలో హీరో శ్లాంగ్ చిత్తూరు భాష. శ్లాంగ్ ఏదైనా సులువుగా పలికించే తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. మరి సుకుమార్.. అల్లు అర్జున్ ఎలా అదరగొట్టపోతున్నారో తెలియాలంటే మనం ఇంకా చాలాకాలం వెయిట్ చేయక తప్పదు.