బన్నీ వెళ్తుంటే... ఫొటో తీసిన స్థానికుడు... అపుడేమైందంటే

July 03, 2020

 

కరోనా వల్ల ఒకర్ని ఇంకొకరు తాకడానికి భయపడుతున్నారు. అందుకేనేమో సెలబ్రిటీలు ధైర్యంగా బయటకు వస్తున్నారు. మొన్న రకుల్ ప్రీత్ మెడికల్ షాపునకు వచ్చి మందులు కొనడానికి వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. తాజాగా అల్లు అర్జున్ వీడియో వైరల్ అవుతోంది.

చాాలా రోజుల నుంచి షూటింగుల్లేవు. సెలబ్రిటీలు ఖాళీ. ఏదో రకమైన పనులతో వారు పొద్దు పోగొట్టుకుంటున్నారు. చాలామంది స్టార్లు పిల్లలతో ఆడుకోవడానికి, వర్కవుట్లకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. 

తాజాగా అల్లు అర్జున్ మాసిన గడ్డంతో ఇంటి వద్దే వాక్ చేస్తూ ఉన్నాడు. బార్బర్ లేక ఆ గడ్డం పెంచలేదు. పుష్ప సినిమా కోసం పెంచిన గడ్డం అది. బన్నీ ఇంటి వద్ద నడుస్తుండగా... స్థానికుడు ఒకరు వీడియో తీయబోయారు. అది గమనించి బన్నీ భద్రతా సిబ్బంది... వద్దు వద్దు అంటూ వారిస్తూ బన్నీని కొంచెం కవర్ చేస్తూ ముందుకెళ్లిపోయాడు.

ఇపుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. బన్నీ పుష్ప సినిమాలో ఈపాటికే పాల్గొనాల్సి ఉంది. లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఈ నెల 20 నుంచి మళ్లీ షూటింగ్ మొదలుకావచ్చు అంటున్నారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. షూటింగ్ బ్యాన్ కావడంతో సినిమా విడుదల తేదీ కూడా ముందుకు జరిగిపోయింది. ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని అయోమయం ప్రస్తుతం నెలకొంది.