సొంత గుర్తింపు కోసం అల్లు వారి తాప‌త్ర‌యం ?

July 15, 2020

ఇంత‌కుముందు త‌న సినిమాల వేడుక‌ల్లో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిని ఎలా పొగిడేవాడో.. మెగా అభిమానుల అండ గురించి ఎలా మాట్లాడేవాడో గుర్తుండే ఉంటుంది. ఐతే కొన్నేళ్లుగా అత‌డి స్వ‌రం మారుతోంది. చిరును పొగుడుతున్నాడుకానీ.. త‌న‌పై మెగాముద్ర ప‌డ‌కుండా ఉండ‌టానికి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. సొంత గుర్తింపు, ఇమేజ్ కోసం అత‌ను త‌పిస్తున్న వైనం స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్‌లో బ‌న్నీ స్పీచ్ ఎంత చ‌ర్చ‌నీయాంశం అయిందో తెలిసిందే. త‌న‌కు అభిమానులు లేర‌ని.. ఆర్మీ ఉంద‌ని.. వారి వ‌ల్లే తాను ఈ రోజు ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాన‌ని బ‌న్నీ అన్న మాట‌ల‌పై జ‌నాలు ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకున్నారు.
ఐతే అప్పుడు బ‌న్నీ లాగే ఇప్పుడు అత‌డి తండ్రి అల్లు అర‌వింద్ సైతం ఈ చ‌ర్చ‌ను కొన‌సాగించేలా మాట్లాడ‌టం విశేషం. ఎప్పుడూ వేదిక‌ల‌పై చిరు జ‌పం చేసే ఆయ‌న ఈసారి ఆయ‌న పేరెత్త‌కుండా త‌న ప్ర‌స్థానం గురించి.. అల్లు కుటుంబం ఎదుగుద‌ల గురించి మాట్లాడారు. అల వైకుంఠ‌పురం థ్యాంక్స్ మీట్లో అర‌వింద్ మాట్లాడుతూ మా కుటుంబం ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన‌గానే చిరు ప్ర‌స్తావ‌న ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఆయ‌న దానికి భిన్నంగా మాట్లాడారు. ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు సినీ క‌ళామ‌త‌ల్లి, అల్లురామ‌లింగ‌య్య అన్నారు. “తెలుగు కళామతల్లికి ఒక రూపమిస్తే, ఆమె కాళ్లదగ్గర సేదతీర్చుకుంటున్న కుటుంబం మేం. అల్లు రామలింగయ్య గారి నుంచి మా అబ్బాయిల దాకా.. ఇన్నేళ్ల నుంచీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అంటూ ప్ర‌సంగం కొన‌సాగించిన అర‌వింద్ చిరు ప్ర‌స్తావ‌నే లేకుండా ముగించ‌డం విశేషం. బ‌న్నీ త‌ర‌హాలోనే అర‌వింద్ కూడా సొంత గుర్తింపు కోసం తాప‌త్ర‌య‌ప‌డుతున్నార‌నే భావ‌నను క‌లిగించింది ఈ ప్ర‌సంగం.

Read Also

జగన్ ను సైతం హిమాన్షు డామినేట్ చేశారా?
క్లీవేజ్ నిధి... మెరిసింది మళ్లీ !!
ఆదాయం పెంచుకునే మార్గమెక్కడ సీఎం గారూ??