ఇది కదా టాలీవుడ్ చేయాల్సింది.... ఉద్యమం షురూ

August 07, 2020

చైనా బలం... ఇండియా. 

అవును చైనా బతుకుతున్నది మన మీద ఆధారపడే అన్నది సత్యం. 

ప్రపంచ జనాభా 750 కోట్లు..

ఇందులో చైనా జనాభా 140 కోట్లు

వీరు పనిచేస్తారు గాని ఏమీ కొనరు. 5 శాతం చైనా జనాభాకు మాత్రమే స్వేచ్ఛ

ఆఫ్రికా జనాభా 130 కోట్లు. వారు ఏమీ కొనే స్థితిలో లేరు.

దక్షిణ అమెరికా ఖండం జనాభా 50 కోట్లు. వాళ్లకి చైనా ఉత్పత్తులతో పని లేదు. ఇక్కడికి 320 కోట్ల జనాభా అయిపోయింది.

ఇతర సంపన్న దేశాలు, పాశ్చాత్య దేశాల జనాభా 300 కోట్లు. వారు చైనా చీప్ ఉత్పత్తులు కొనరు. 

ఇక మిగిలింది మనం... మన జనాభా  130 కోట్లు. 

ప్రపంచ జనాభాలో చైనాను బతికిస్తున్నది మనమే. మనం దానికి వినియోగదారులం. మనం కొనడం మానేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ అల్లాడిపోతుంది. అయినా... మనం వారి వస్తువులకు బానిసలట. వాడకుండా ఉండలేమట. అందుకే మనం వాళ్లనేమీ చేయలేమట. ఇది చైనా పొగరు.

దీనిని దించాల్సిన సమయం వచ్చేసింది. 

ప్రతి భారతీయుడు కుదిరినంత వరకు చైనా ప్రొడక్టులనే కాదు, విదేశీ బ్రాండ్ల వాడకాన్ని తగ్గించాలి. మన వద్ద ప్రత్యామ్నాయం లేకపోతేనే అది కూడా చైనా యేతర ఉత్పత్తి వాడాలి. అంతేగాని చైనా ఉత్పత్తిని వాడకూడదు. 

అల్లు శిరీష్ ఈరోజు ఒక మంచి పని చేశారు. మార్కెట్ కి వెళ్లి... ఏరికోరి భారతీయ బ్రాండ్లను వెతుక్కుని కొనుక్కున్నారు. వీలైనంత వరకు అందరూ ఇలాగే చేయండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫొటోను పెట్టారు. కుదరనపుడు ఏం చేయలేం. అవకాశం ఉన్నంత వరకు మన ఉత్పత్తులనే వాడదాం అంటూ పిలుపునిచ్చాడు. 

చిన్న హీరో అయినా పెద్ద సందేశం ఇచ్చాడు శిరీష్. దీనిని టాలీవుడ్ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. వారి మీద ఉన్న అభిమానంతో అయినా చైనా ఉత్పత్తుల వాడకం తగ్గిస్తారు. మనం ఇతర దేశాల ఉత్పత్తులు వాడకం వల్ల మన డబ్బు ఇతర దేశాలకు తరలిపోవడమే కాకుండా, మన విదేశీ మారక నిల్వలు పడిపోతాయి.

దీనివల్ల మన కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే మనం భారతీయ కంపెనీల ఉత్పత్తులును కొనడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను, మన ఉద్యోగాలను కాపాడుకుందాం.