అమలాపాల్... మోస్ట్ రొమాంటిక్ పిక్

February 22, 2020

సగం సినిమాలో నగ్నంగా నటించడం ఒక హీరోయిన్ కి మాటలు కాదు. అలాంటి సాహసం చేసింది కేరళలో పుట్టి తమిళంలో హీరోయిన్ గా రాణిస్తున్న అమలాపాల్.  సంచలనాలకు ఎన్నడూ వెనుకడుగు వేయదు. సమాజం కోసమో, ఇంకెవరి కోసమో ఆమె ఆలోచిస్తూ ఉండదు. తనకు ఎపుడు ఏమనిపిస్తే అది చేస్తుంది. ఒక సినిమాలో నగ్నంగా నటించడమే చాలా గొప్ప. అలా నటించిన సినిమాను తనే నిర్మాత అన్నంత స్థాయిలో ప్రమోట్ చేసింది.

తక్కువ సమయంలో చాలా భిన్నంగా ఆమె కెరీర్ కొనసాగింది. తక్కువ సినిమాలతో ఎక్కువ పేరు తెచ్చుకుంది. డబ్బు మీద కంటే... తనకిష్టమైన పని చేయడంలోనే ఆమెకు ఆసక్తి, అదే ఇష్టం. పర్సనల్ లైఫ్ కూడా ఆమెది డిఫరెంట్ గానే సాగింది. 2014లో పెళ్లి చేసుకుని.. పెళ్లికి ముందు ఇచ్చిన మాట తప్పి... నటన ఆపేయమన్నారని... ఏకంగా విడాకులు తీసుకున్నారు అమలాపాల్. కెరియర్ కి, పర్సనల్ లైఫ్ గ్యాప్ పెట్టుకుంటూ... జీవిస్తుంది. ఆమెకు సాధారణ జీవితం, నిరడంబరత్వం ఇష్టం. ఇక సినిమా విషయానికి వచ్చేటప్పటికి సినిమా కోసం ఏం చేయడానికి అయినా ఆమె సిద్ధమే. రొమాంటిక్ గా కనిపించడానికి, స్కిన్ షో చేయడానికి ఆమె అస్సలు వెనుకాడదు. ఇది అమలాపాల్ సూపర్ హాట్ పిక్స్ లో ఒకటి.