కోర్టుపై కామెంట్లు : ఆమంచికి ఎవరైనా చెప్పండయ్యా... 

May 29, 2020

తమ అధినేతకు నచ్చని పని చేస్తే ఎవరికైనా పతనం తప్పదు అన్నట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. డాక్టరు సుధాకర్ కేసు విషయంలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న కేసులు కూడా సీబీఐకి అప్పగించడం మంచిది కాదని అన్నారు. డాక్టర్ సుధాకర్ తరపున వేసిన పిటిషన్ ను హైకోర్టు సమర్థించడం సరికాదన్నారు. సుధాకర్ కేసు పెట్టీ కేసు అని, దానిని సీబీఐ విచారణకు ఆదేేశించడం హాస్యాస్పదం అన్నారు.

సుధాకర్ కేసులో సీబీఐ విచారణ వేయడంతో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమంచి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల భూములను అమ్మితే దెబ్బతినని మనోభావాలు హైకోర్టు ఒక కేసును సీబీఐకి ఇస్తే ఎలా దెబ్బతింటాయో ఆమంచి వివరిస్తే బాగుంటుంది. 

మళ్లీ ఎక్కడ కోర్టు ధిక్కారం అంటారో అని భయపడి... కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదనే విషయం తనకు తెలుసని... కానీ, ఇలాంటి తీర్పులతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని గుర్తించాలన్నారు ఆమంచి. 

ఇక్కడ ఆమంచి తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. సుధాకర్ కేసు క్రైమ్ కేసు. నడి రోడ్డుపై ప్రజల సాక్షిగా చేతులు కట్టేసి చొక్కా విప్పేసి ఒక వైద్యుడిపై పోలీసులు మూకుమ్మడిగా దాడిచేస్తే అది పెట్టీ కేసా? ప్రజా భద్రతకు భరోసా లేని కేసా ? అన్నది ఆమంచికి ఎవరైనా వివరించండయ్యా...

ముఖ్యమంత్రిని ఉరేయాలి అని ప్రతిపక్ష నేత అంటే నేరం కాదు, కానీ ఒక డాక్టరు కరోనా సోకకుండా మాస్కులు కావాలి అని అడిగితే అది సస్పెండ్ చేయాల్సినంత పెద్ద నేరమా? అన్నది ఆమంచికి వివరించండయ్యా...

సాక్షాత్తూ డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన నివేదికలో గాయాలు దాచిపెడితే... ఆ కార్యాలయం అదుపులో పనిచేసే పోలీసులకు సుధాకర్ కేసు ఇస్తే న్యాయం జరుగుతుందా? మరి దీనిని సీబీఐకి కాక ఇంకెవరికి అప్పగించాలి? ఆమంచికి ఎవరైనా వివరించండయ్యా....

అడ్డగోలు పనులు చేసి కోర్టులు తప్పు పడితే కోర్టులనే విమర్శిస్తున్నారంటే... న్యాయ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకుంటున్నారా? ఏంటి? ఆమంచి గారూ... ఆలోచించండి. 

ఇక ఇది పెట్టీ కేసు అని వాదిస్తున్న ఆమంచి... అంతర్జాతీయ పత్రికలు ఆ సంఘటనను ఎందుకు పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి జగన్ ను ఏకిపడేశాయో చెప్పాల్సింది ఆమంచిగారే. 

 

ఇదిగో అంతర్జాతీయ పత్రికల లింకులు

BBC

Doctor who raised concerns over PPE shortage admitted to mental hospital 

 

The Quint

‘Made a Nuisance’: Cops Chain, Drag Vizag Doc Who Voiced PPE Issue 

 

London Daily Metro (image)

Read Also

జగన్... అక్కడ గుళ్లు కట్టించు
మోడీషాల... ఓపికను పరీక్షిస్తున్న జగన్, తాజా గొడవతో జగన్ అవుటే
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సూపర్ సక్సెస్ ???