అమరావతి రైతుల కొత్త ఐడియా

February 21, 2020

అమరావతి రాజధానిగా ఉండాలి అమరావతి ప్రజలే కాదు... చాలామంది కోరుకుంటున్నారు. అది అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండటమే దీనికి కారణం. అయితే... ఉత్తరాంధ్ర ప్రజలు కూడా రాజధాని అయితే సామాన్యులకు ఒరిగేదేం లేదని మాకు అద్దెలు పెరగడం, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ అవుతాయని.. అమరావతియే బెస్ట్ అంటున్నారు. ఇక రైతులు తమకు తోచిన అన్ని మార్గాల్లో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వంటా వార్పు, ధర్నాలు, రిలే దీక్షలు, నిరసనలు, రాస్తారోకో వంటి అన్ని మార్గాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితిగా ఏర్పడి బస్సుయాత్రను ప్లాన్ చేస్తే దానిని పోలీసులు అడ్డుకున్నారు. 

కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాసిన రైతులు తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీకి తమ కాపాడమని వేడుకుంటూ వరుస కాల్స్ చేశారు. మన్ కీ బాత్ లో సాధారణంగా ఎవరైనా కాల్స్ చేయొచ్చు. దీనిని అమరావతి రైతులు సద్వినియోగం చేసుకున్నారు. మేము రాజధాని కోసం భూములు అన్నీ ఇచ్చేశామని, భవిష్యత్తు మీద భరోసాతో ఐదేళ్లుగా వ్యవసాయం లేకపోయినా ఇబ్బందులు పడి బతుకుతున్నామని... ఇపుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతామని వారు మన్ కీ బాత్ లో కోరారు. రాష్ట్రానికి రాజధాని మార్చడమే ఇంతవరకు ఎక్కడా జరగలేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. గతంలో రాజధాని మార్చిన ఉదాహరణలు ఉండి ఉంటే... తాము భూమి ఇచ్చేవారం కాదని, మమ్మల్ని ఆదుకోమని వారు మన్ కీ బాత్ లో ప్రధానిని కోరారు.