జగన్ ను తప్పుపట్టిన మరో టాలీవుడ్ ప్రముఖుడు

June 05, 2020

అమరావతి రాజధాని విషయంపై ఏపీలో జరుగుతున్న రచ్చ ఓ రేంజిలో ఉంది. ఏపీని పీడిస్తున్న ఎన్నో సమస్యలు పరిష్కారం దొరకక రాజధాని అనే తేనెతుట్టెను కదిలించి జగన్ అడ్డంగా బుక్కైపోయారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మూడు రాజధానుల కాన్సెప్ట్ తో మా ఏరియాకు అభివృద్ధి అని వైసీపీ చేసే ప్రచారం... వాస్తవాల ముందు తేలిపోతుంది. అయినా... డబ్బుల్లేవు అంటూ రాజధాని మార్పులు ఏమిటి అంటూ అందరూ జగన్ ను నిలదీసే పరిస్థితి. చివరకు జగన్ ను గుడ్డిగా సమర్థించిన వారు కూడా జగన్ ను సమర్థించి తప్పు చేశాం అంన్న భావకు తెచ్చారు జగన్ తన పారిపాలనతో. 

తాజాగా ప్రముఖ తెలుగు సినిమా వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. మంచయినా, చెడయినా... అమరావతిని మన రాజధానిగా రాష్ట్ర మంతటా ఫిక్సయ్యింది. ఏడు వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఇపుడు మార్చడం మూర్ఖత్వం. రెండు వేల కోట్లు పెడితే పూర్త్యయ్యే రాజధాని వదిలేసి కొత్తగా వెదుక్కుంటూ పోవడం ఏమిటి అంటూ ఆయన నిలదీశారు. వాస్తవానికి రాజధాని అనేది ఒక భ్రమ అని... పాలన ఎక్కడ నుంచి కొనసాగితే అదే రాజధాని అని ఆయన విశ్లేషించారు. 3 కాకపోతే 30 పెట్టుకోవచ్చ. టెక్నికల్, ఎమోషనల్ గా జనాలు ఒకటి ఫిక్సయిపోతారు. దాంతో అంత సచివాలయం ఉన్నదే రాజధాని అవుతుంది.. మిగతావి పుస్తకాల్లో మిగిలిపోతాయన్నది తమ్మారెడ్డి భావన.