సాయిరెడ్డి మాట వింటే పాతాళానికిపోతావు జగన్

June 05, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి వెఎస్ జ‌గ‌న్ స‌న్నిహితుడు, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కాంగ్రెస్ నేత, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నాయ‌కురాలు సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు. విశాఖే రాజధానిగా ఉంటుంద‌ని దీన్ని ఆపడం ఎవరి తరం కాదుని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె ఘాటుగా స్పందించారు. "మీ అమ్మ మొగుడు వచ్చినా రాజధానిని ఇంచి కూడా కదిలించలేరు... అమరావతే అంధ్రప్రదేశ్ కు రాజధాని````A1 , A2 ముద్దాయిలుగా , ఎఫ్హుడు జైలు కి వెళ్తారో తెలియని మీరు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని నిర్ణయిస్తారా ??`` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.
ముఖ్య‌మంత్రి జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి దమ్ము ఉంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మారుస్తామని ఎందుకు పెట్టలేదని సుంక‌ర ప‌ద్మ‌శ్రీ ప్ర‌శ్నించారు. ఇప్పటికయినా మించిపోయింది లేదు ... రాజీనామాలు చేసి , 3 రాజధానుల ప్రకటనతో ఎన్నిక‌ల‌కు వెళ్ళండి... అప్పుడు మీ పరిస్థితి ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారు. అని వ్యాఖ్యానించారు. ``విజయసాయిరెడ్డి! తప్పుడు లెక్కలు వ్రాసి, లక్ష కోట్లు దోచుకోవటం అనుకుంటున్నావా... ప్రజలు తలచుకుంటే మీ తల రాతలు మారుస్తారు! అది గుర్తుపెట్టుకో... ఖబడ్దార్... ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు!``అని మండిప‌డ్డారు.

``జగన్ రెడ్డి...మీరు ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలవాలి అనుకుంటే, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజాసంక్షేమం కోసం కృషి చేసి చూపండి. విజయసాయిరెడ్డి లాంటి  దొంగలు, రాజకీయ అజ్ఞానులు ఇచ్చే తప్పుడు సలహాలు వింటే.. రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది! శకుని మామ లాంటి విజయసాయిరెడ్డితో రోజు రోజుకు ప్రజలకు దూరం కావడం తప్ప జగన్‌కు ఒరిగేదేమి లేదు. శవాల మీద పేలాలు ఏరుకునే బుద్దితో.. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుని ఉంటే.. టెస్టింగ్‌ కిట్లలో కూడా డబ్బులు దొబ్బేసి.. దాన్ని పక్కదారి పట్టించడానికి మరోసారి రాజధాని మార్పు అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు... ఖబడ్దార్‌! వెంకటేశ్వరస్వామిని కొలుస్తా అని గొప్పలు చెప్పుకుంటున్న సాయిరెడ్డి... అదే స్వామి వారికి అమరావతిలో ఆలయ నిర్మాణాన్ని ఎందుకు ఆపారో చెప్పగలరా.. అంత దమ్ము ఉందా... క‌రోనా వ్యాప్తి నియంత్రణలో విఫలం అయిన మీకు.. ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేక.. మీడియా ముందు నోటికి పని చెప్పడం కాదు. ముందు రాష్ట్రాన్ని కరోనా నుంచి కాపాడండి... ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి.` అని మండిప‌డ్డారు.