​జగన్... అపుడే అబద్ధాలు మొదలుపెట్టావా?​

July 05, 2020

జగన్ రావడంతోనే ​​అమ‌రావ‌తి-అనంత‌పురం ఎక్స్ ప్రెస్ హైవే​ ని మంజూరు చేయించుకున్నాడని, ఇదీ జగన్ సత్తా అని, మంచి ముఖ్యమంత్రి ఉంటే లాభాలు ఇట్లా ఉంటాయని అబద్ధాన్ని తెగ ఊదుతున్నారు. అన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పడం కుదరదు. అడ్డంగా దొరికిపోతాం అని తెలుసుకోవాలి. వచ్చిన రెండు వారాల్లో అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయారు జగన్?
రాయ‌ల‌సీమ ప్రాంతానికి రాజ‌ధానితో నేరుగా క‌నెక్టివిటీ కోసం అమ‌రావ‌తి-అనంత‌పురం ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు చేప‌​ట్టిన విషయం తెలిసిందేగా. ఈ ప్రాజెక్ట్ ​ఇప్పటికే ​భూసేక‌ర‌ణ​ పూర్తయ్యింది. ​కొన్ని చోట్ల చివరి ద‌శ‌లో ఉంది.​ ఈ రహదారి మొత్తం రోడ్డు పొడ‌వు 384 కిలోమీట‌ర్లు.​ ​ప్రాజెక్ట్ అంచ‌నా వ్య‌యం రూ.27,635 కోట్లుగా నిర్ణ‌యించారు.​ ఈ​ ఆరు లైన్ల రహదారి​ ఆమోదం పొందింది ఫిబ్రవరి, 22 2019.​
వైస్సార్సీపీ ఒక అడుగు ముందుకేసి ఇది జగనన్న సాధించిన గొప్ప విజయం​గా తన ఖాతాలో వేసుకుంటోంది. కింది ఫొటోలో వున్నది ఫిబ్రవరి, 22 2019 అంటే చంద్రబాబు ప్రభుత్వం ఉన్న కాలంలోనే వచ్చిన రాజపత్రం. చంద్రబాబు ప్రభుత్వం ఐదు సంవత్సరాల కష్టం ఫలితం.​ దీన్ని వైస్సార్సీపీ​ తన ఖాతాలో ఎలా వేసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ​అబద్ధం చెబితే నమ్మేలా ఉండాలి.