అమరావతిపై జగన్ కొత్త ప్లాన్...

July 06, 2020

ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో అమరావతి అల్లకల్లోలం అయ్యింది. ఎంతో భవిష్యత్తును ఊహించి ఇచ్చిన రైతులకు భంగపాటు మాత్రమే కాదు వారు ఏకంగా రోడ్డున పడ్డారు. ఇవన్నీ ఒకెత్తు అయితే... అమరావతి లో ఇన్వెస్టుమెంట్లు చేసిన కంపెనీలు, అమరావతిని దృష్టిలో పెట్టుకుని అక్కడికి తరలివచ్చిన హోటళ్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఇంకా అనేక రకాల పెట్టుబడిదారులు తరలిపోయే ప్రమాదం ఉంది. జగన్ నిర్ణయం అసలు ఏపీ మీద పెట్టుబడిదారుల నమ్మకాన్నే మార్చేసింది. బుద్ధుంటే ఏపీలో వీలైతే ఇండియాలో పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని డిసైడ్ అయ్యేంత తీవ్ర నిర్ణయాలకు కారణమైంది.

ఇదిలా ఉంటే... జగన్ అమరావతిలో ఉదృతంగా నిరంతరంగా నిరసనలకు దిగిన రైతులను ఎలా శాంతింపజేయాలా అనే ఆలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి వద్దకు రాగా... వాటిలో ఒక ప్రతిపాదనపై జగన్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.  అమరావతి ప్రాంతాన్నా SAZ (special agriculture Zone) గా  ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు. అంటే వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు, వివిధ రకాల పంటల పరిశోధనలు, విలువైన కొత్త పంటల అభివృద్ధి, సీడ్ డెవలప్మెంట్, కొంత వంగడాల ఆవిష్కరణ వంటి వాటికి కేటాయిస్తాయి. వీటికి కొన్ని భవనాలు కూడా అవసరం కాబట్టి ఇపుడు కట్టిన భవనాలు దీనికోసం ఉపయోగిసారు. నాన్ రిటర్నబుల్ ప్లాట్లు, గవర్నమెంట్లు ప్లాట్లు ఈ జోన్ కిందకు తెస్తారు. తిరిగి ఇవ్వగలిగిన అవకాశం ఉన్న పొలాలను తిరిగి రైతులకు ఇచ్చేస్తారు. 

ఇందులో రైతులకు మునుపటి లా వ్యక్తిగత వ్యవసాయం చేసుకునే అవకాశం లేకున్నా... అంతకుమించి లాభదాయకంగా ఉండేలా వర్కవుట్ చేస్తే రైతులు శాంతించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనలపై వ్యవసాయ నిపుణులు పనిచేస్తున్నారు. ఏ విధంగా చూసినా వారు వ్యవసాయం చేసినప్పటి కంటే కూడా మరింత విలువ దక్కేలా ప్లాన్ చేస్తేనే రైతులు ప్రతిపాదన వైపు మొగ్గు  చూపే అవకాశం ఉంది గాని... లేకపోతే కష్టం అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా అమరావతి రైతులు మాత్రం దీనిని పట్టించుకోవడం లేదు. రాజధాని ఇక్కడ ఉండాల్సిందే. మేము ఇరు పక్షాలు ఒప్పుకున్నాయి కాబట్టి భూమిని ఇచ్చాం. లేకపోతే ఆనాడే మా భూమిని ఇవ్వకుండా ఉండేవారము అని రైతులు నినదిస్తున్నారు.