అమ‌రావ‌తి లో ఏముందో 30న చూస్తారు

May 25, 2020

టెంప‌ర‌రీ అని ప‌దాన్ని దారుణంగా దుష్ప్ర‌చారం చేయ‌డానికి వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తోంది. వాస్త‌వానికి అమ‌రావ‌తిలో టెంప‌ర‌రీ అని పిలుస్తున్న బిల్డింగులు ఏవీ కూల్చేవి కాదు. అవి కూడా వందేళ్లు ఉండేలా క‌ట్టారు. కాక‌పోతే ఆ మాత్రం దానికి చంద్ర‌బాబు ఎందుకు... అనే ప్ర‌శ్న వ‌స్తుంది. అమ‌రావ‌తి వంటి మ‌హాన‌గ‌రం విశ్వ‌రూపం పూర్తి అయితే... ప్ర‌పంచ ప‌ర్యాట‌కులు సింగ‌పూర్‌కి, డెన్మార్క్‌కి వెళ్లిన‌ట్టు కేవ‌లం ఆ న‌గ‌రాన్ని చూడ‌టానికే ఏపీకి రావాలి. ఏపీ ఆదాయంలో స‌గానికి పైగా ప‌ర్యాట‌క ఆదాయం ఉండాలి. అంటే భ‌విష్య‌త్తులో అమ‌రావ‌తి ప‌ర్యాట‌కం ద్వారానే ల‌క్ష కోట్ల పైచిలుకు ఆదాయం తేవాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌. అందుకే బ‌ల‌మైన భ‌విష్య‌త్తు కోసం మ‌హోన్న‌త ప్ర‌ణాళిక‌తో 500 ఏళ్ల‌కు స‌రిప‌డే మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందించారు. అందుకే అమ‌రావ‌తి ఆల‌స్యం.
ఇదంతా ప‌క్క‌న పెడితే రాజధానిలో ఏమీ లేద‌నే వారికి ఈనెల 30న జ‌రిగే ఐటీ ఫెస్ట్‌తో వాస్త‌వాలు చెప్పాలని ఏపీ సంస్థ‌లు నిర్ణ‌యించాయి. అమ‌రావ‌తిలో జ‌రిగిన‌ ఐటీ అభివృద్ధిని కళ్లకు కట్టేలా ‘అమరావతి ఐటీ ఫెస్ట్‌’ను నిర్వ‌హించ‌డానికి భారీ ప్లాన్ రెడీ అయ్యింది. ఏపీఎన్నార్టీ, ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ, ఎపిటా సంస్థల సంయుక్త‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రుగుతుంది. మార్చి 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు రాజధానికి వచ్చిన 94 ఐటీ కంపెనీలు, వాటిలో పనిచేస్తున్న 4,500 మంది ఉద్యోగులు, ఐటీ కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు ఈ ఫెస్ట్‌లో పాల్గొంటాయి.
అనేక ఐటీ-మ‌ల్టీ మీడియా- టెక్నాల‌జీకి సంబంధించిన వివిధ కంపెనీల స్టాళ్లు ఏర్పాటుచేస్తారు. ఈ స్టాల్స్ ద్వారా భ‌విష్య‌త్తులో ఆయా రంగాల్లో రాణించ‌డానికి అవ‌స‌ర‌మైన గెడైన్స్ ఉచితంగా ఇస్తారు. పాస్‌లు ముందుగా ఇస్తున్నారు. ఆస‌క్తి ఉన్న‌ వాళ్లు తీసుకోవచ్చు. ఒక‌వేళ ఎవ‌రైనా ముందుగా పాస్ తీసుకోలేక‌పోతే...స్టేడియం ద‌గ్గ‌ర మీ కాలేజీ ఐడీ కార్డు, ఇత‌ర ఐడీ కార్డు చూపించినా ఇస్తారు.