తెనాలి సభ... వైసీపీకి భ‌యం పుట్టించిందా?

July 03, 2020

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణ‌యాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. రాజధాని అమరావతి తరలించవద్దని రైతులు, ప్ర‌తిప‌క్ష‌, అఖిలపక్ష నేతలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడ‌చెవిన పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్ర‌భుత్వానికి...ప్ర‌పంచానికి త‌మ వాణి మ‌రింత గ‌ట్టిగా వినిపించేలా తెనాలిలో టీడీపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఈ బహిరంగ సభలో అఖిలపక్ష, జేఏసీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీలు, ప‌లువురు నేతలు పాల్గొన్నారు. వేలాది మంది రైతులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్న ఈ స‌భ వైసీపీ గుండెల్లో గుబులు పుట్టించింది. న‌యా తుగ్ల‌క్‌గా జ‌గ‌న్‌ను అభివ‌ర్ణించిన చంద్ర‌బాబు.....త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌కు వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తాన‌ని స‌భా వేదిక‌ నుంచి వార్నింగ్ ఇచ్చారు.  
రాజధాని తరలింపున‌కు వ్య‌తిరేకంగా 50 రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నా సీఎం జగన్‌కు చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేద‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అమరావతిని తరలిస్తారన్న దిగులుతో 37 మంది రైతులు చనిపోయినా చ‌లించని పాషాణ హృద‌యం జ‌గ‌న్‌ద‌ని మండిప‌డ్డారు. త‌న తుగ్ల‌క్ నిర్ణ‌యాల‌తో ఇంకా ఎంతమందిని జ‌గ‌న్ బ‌లి తీసుకుంటార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.  ఆ 37 మందిని ప్రభుత్వమే హ‌త్య చేసింద‌ని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలపై దొంగ‌ కేసులు బనాయిస్తున్న ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ తొందరల్లోనే జ‌గ‌న్ రోల్ వస్తుంద‌న్న సంగ‌తి గుర్తుపెట్టుకోవాల‌ని, ఆరోజు  తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతే రాజధాని అంటున్నాయని, అధికారముంది క‌దా అని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయ‌డం ఏమిటని మండిప‌డ్డారు. జ‌గ‌న్ త‌ర‌హా దుర్మార్గమైన పాలనను దేశంలో ఎక్కడా చూడలేదని వైసీపీ ప్రభుత్వంపై చంద్ర‌బాబు విరుచుకుపడ్డారు. చరిత్రలో తుగ్లక్ చనిపోయాడనుకుంటే, మళ్లీ మన రాష్ట్రంలో పుట్టాడని, వైఎస్ జ‌గ‌న్ ‘నయా తుగ్లక్’ అంటూ జగన్‌ను ఎద్దేవా చేశారు. ఇటువంటి విప‌రీత ధోర‌ణులు పోతున్న జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు అన్నారు.
ఈ బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌ను చూసి వైసీపీ శ్రేణుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఈ స‌భ‌కు వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన రైతులు,
స‌భ‌కు జాతీయ స్థాయిలో వ‌చ్చిన అనూహ్య స్పంద‌న చూసి మైండ్ బ్లాక్ అయింద‌ట‌. ప్ర‌త్యేకించి వైసీపీ అధినేత జ‌గ‌న్ నియంతం పోక‌డ‌ల‌ను చంద్ర‌బాబు ఎండ‌గ‌ట్టిన తీరు వైసీపీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదట‌. ఇప్ప‌టివ‌ర‌కు సంయ‌మ‌నం పాటించిన చంద్ర‌బాబు ఒక్క‌సారిగా జూలు విదిల్చే స‌రికి...వైసీపీ అధిష్టానం కూడా డిఫెన్స్‌లో ప‌డింద‌ట‌. వేల ఎక‌రాలు ఇచ్చిన రైతుల‌కు విప‌రీత‌మైన మ‌ద్ద‌తు రావ‌డంతో ఏం చేయాలో తెలియ‌క వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.
తెనాలి స‌భ ఎఫెక్ట్ వైసీపీ శ్రేణుల‌పై పడింద‌న‌డానికి ఆ పార్టీ హ‌డావిడిగా రూపొందించిన కార్య‌చ‌ర‌ణే నిద‌ర్శ‌నం. తెనాలి స‌భ దెబ్బ‌కు వైసీపీ హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా స‌ద‌స్సులు, స‌మావేశాలంటూ షెడ్యూల్ ను ప్ర‌క‌టించిందంటే ఈ స‌భ వారిని ఎంత భ‌య‌పెట్టిందో అర్థ‌మ‌వుతోంది. నిజంగా అధికార వికేంద్రీక‌ర‌ణ‌, రాజ‌ధాని త‌ర‌లింపులో వైసీపీ నేత‌ల స్వార్థ ప్ర‌యోజ‌నాలు లేకుంటే....ఈ ర్యాలీలు, స‌ద‌స్సులు....నిర్వ‌హించ‌న‌వ‌స‌రం లేదు క‌దా. ఇక‌, తెనాలి స‌భ అనంత‌రం అయోమయంలో ప‌డ్డ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు...స్వ‌యంగా ర్యాలీల బాట‌లో ముమ్మ‌ర ప్ర‌చారం చేయ‌బోతున్నార‌ట‌.
ఈ స‌భ ఇచ్చిన ఉత్సాహంతో చంద్ర‌బాబు వైసీపీ స‌ర్కార్‌పై మ‌రింత దూకుడు పెంచుతున్నాన‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా...జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన వార్నింగ్ బాగానే ప్ర‌భావం చూపింద‌ని టీడీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో మ‌రింత ఉధృతంగా రాబోతున్న ప్ర‌`చంద్ర‌` తుఫానును వైసీపీ నేత‌లు ఎలా అడ్డుకుంటారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.  

ఇదిలా ఉంటే... తెనాలి సభ సక్సెస్ కావడంపై ఆగ్రహించిన జగన్ ఆ ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. అందువల్లే జగన్ క్లాస్ పీకిన అనంతరం ఆ ఫ్రస్ట్రేషన్లో మీడియా ముఖంగా ఆయన చంద్రబాబును దూషించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.