అమ‌రావ‌తి క‌ట్ట‌కపోయినా ఓకేనా...మీరేమంటారు..

April 03, 2020

గ‌త కొద్దికాలంగా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి విషయంలో రోజుకో విషయం బయటకు వస్తోంది. రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేదంటే మారుస్తారా అనే దానిపై అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలకు త్వరలోనే తెరపడబోతోంది. కొద్దినెలలుగా ఏపీ రాజధాని అమరావతిపై గంద‌ర‌గోళః నడుస్తున్న క్రమంలో ఇటీవలే జగన్ ప్రభుత్వం జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతి సహా రాష్ట్రంలోని మేజర్ సిటీల అభివృద్ధిపైై ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో...ఏపీ రాజధాని, ఇతర నిర్మాణ ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌...గ‌త రెండు మూడు నెలలుగా రాజధాని అంశంపై గందరగోళం ఏర్పడింది. గతంలో రాజధాని ఏర్పాటు కోసం శివరామ కృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారు.  కానీ, గత ప్రభుత్వం శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోలేదని వైకాపా ప్రభుత్వం మండిపడింది. అనంత‌రం అమరావతిపై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. అమరావతి సహా రాష్ట్రంలోని పట్టణాల పురోగతిపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావును నియమించారు. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీమోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలంలు ఉన్నారు.
ఇప్పుడు ఆ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. రాజధానితో పాటు, ఇతర ప్రాజెక్టులపై ప్రజల అభిప్రాయాలను చెప్పాలని ఆ కమిటీ కోరింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, అమలు తీరు..రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనలు ఇవ్వాలని పేర్కొంటూ ఆ సూచనలను ఈమెయిల్  (expertcommittee2019@gmail.com) లేదా లెటర్ల ద్వారా పంపాలని కోరింది. ఈ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆరువారాల్లోకి నివేదికను అందివ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  మరో ఆరు వారాల్లో కమిటీ నివేదిక రాబోతున్న తరుణంలో ఆ నివేదికలో ఏమి ఉండబోతుంది.. ఎలాంటి నివేదికను ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మ‌రోవైపు, నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.