ట్రెండవుతున్న నమస్తే ఆంధ్ర ‘‘అమరావతి కవిత‘‘

August 03, 2020

అమరావతి

29 వేల మంది రైతుల త్యాగం

6 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

అమరావతిని చిదిమేసే కుట్రలు మొదలై రేపటికి 200 రోజులు. 

ఈ నేపథ్యంలో ఎన్నారైలు ప్రపంచ వ్యాప్తంగా మూడు వందలకు పైగా నగరాల నుంచి రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు.

అమెరికాలో న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వరకు,

డిట్రాయిట్ నుంచి అర్కాన్సాస్ వరకు,

మిన్నియాపోలిస్ నుంచి డల్లాస్ వరకు,

సియాటెల్ నుంచి కాలిఫోర్నియా వరకు,

కెనడా నుంచి ఇంగ్లాండ్ వరకు,

సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు,

సింగపూర్, కువైట్, ఐర్లాండ్, జెర్మనీ, ప్రాన్స్ , సౌదీ అరేబియా వరకు

ప్రతి ఆంధ్రుడిలోనూ ఒకటే ఆవేదన.. ఎందుకు ప్రభుత్వాలు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాయని..

ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి ఒక్కటే రాజధాని గా వుండాలని ఆంధ్రులంతా కలిసి చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం 200 రోజులు సందర్భముగా ప్రపంచం లోని 200 పైగా నగరాలలో July 03 వ తారీఖున ప్రవాసాంధ్రుల కొవ్వొత్తుల నిరసన రాత్రి 9 గంటలకు తలపెట్టారు. 

ఈ నేపథ్యంలో అమరావతి ఆవేదనను, డిమాండ్ ను కలిపి నమస్తే ఆంధ్ర పై కవితను ప్రచురించింది.