అమ‌రావ‌తిపై టీడీపీ విజ‌న్‌కు ప్ర‌జ‌లు జైకొడుతున్నారుగా...!

February 22, 2020

ఏపీ రాజ‌ధాని విష‌యంపై ఇటు గ‌ల్లీ నుంచి అటు ఢిల్లీ వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం జ‌గ‌న్ రాజ‌ధానిని మారుస్తానంటూ.. న‌ర్మ‌గ‌ర్భంగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత ఈ విష‌యం ఒక్క‌సా రిగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అనేక విష‌యాలు తెర‌మ‌రుగై.. కీల‌క‌మైన రాజ‌ధాని విష‌యం అంద‌రి నోళ్ల‌లోనూ నానుతోంది. ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లుసుకున్నా.. ఇదే విష‌యంపై మాట్లాడుతున్నారు. కొద్ది సేపు జ‌గ‌న్ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అస‌లుగ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో ఏర్పాటైన అమ‌రావ‌తిని ఎం దుకు మార్చాల‌ని జ‌గ‌న్ చూస్తున్నారు? ఆయ‌న చెబుతున్న‌ట్టు అభివృద్ధి కోస‌మేనా? అనే చ‌ర్చ న‌డుస్తోంది.
ఈ క్ర‌మంలోనే నాడు అమ‌రావ‌తిని ఏర్పాటు చేస్తూ.. టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం. పార్టీ అధినేత‌గా, ఫార్టీ ఇ యర్స్ ఇండ‌స్ట్రీగా చంద్ర‌బాబు విజ‌న్‌ను కూడా ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. చంద్ర‌బాబు విజ‌న్ ప్ర‌కారం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది కీల‌క‌మైన పాయింట్‌. అదేస‌మ‌యంలో రాజ‌ధాని అనేది అంద‌రికీ అందుబాటులో ఉండాల్సిన ప్రాంతం. ఎవ‌రైనా ఒక‌రోజు లోనే రాజ‌ధాని ప్రాంతానికి వ‌చ్చి ప‌నులు పూర్తి చేసుకుని వెళ్లేలా ఉండాల‌ని నాడు చంద్ర‌బాబు భావించారు.
ఈ క్ర‌మంలోనే అంద‌రికీ సెంట‌ర్ ఆఫ్‌ది ప్రాంతంగా ఉన్న అమ‌రావ‌తిని ఆయ‌న ఎంచుకున్నారు. రైతుల నుంచి 33 వేల ఎక‌రాల భూముల‌ను పూలింగ్ విధానంలో సేక‌రించారు.ఇక‌, అదేస‌మ‌యంలో శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు కూడా ప్ర‌తి ప్రాంతం అభివృద్ధి చెందేలా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ప‌లు ప్రాజెక్టుల‌ను కూడా ప్రారంభించారు. దీంతో స్థానికంగా అభివృద్ధి చెంద‌డంతోపాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌, ఉద్యోగ రంగం వంటివి త‌మంత‌ట తామే డెవ‌ల‌ప్ అవుతాయ‌ని ఆయ‌న భావించారు.
ఈ క్ర‌మంలోనే చిత్తూరుకు శ్రీసిటీ, క‌డ‌ప‌కు ఉక్కు ఫ్యాక్ట‌రీ ఉద్యాన వ‌న యూనివ‌ర్సిటీ, శ్రీకాకుళంలో కిడ్నీ రిసెర్చ్ సెంట‌ర్‌, విశాఖ‌లో ఐటీ రంగం వంటి వాటికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. దీంతో  బాబు విజ‌న్‌కు నాడే కాకుండా నేడు కూడా ప్ర‌జ‌ల నుంచి సానుకూలత క‌నిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ భుజానికి ఎత్తున పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌పైనే స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.