​బాబు కలను మోయడానికి సిద్ధమైన జగన్

February 17, 2020

మంచిలో చెడును వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. పైకొసన ఉన్న ఉత్తరాంధ్రకు కింద ఉన్న రాయలసీమకు, అభివృద్ధి చెందిన హైదరాబాదు మహానగరానికి, తీరానికి, పోర్టుకు అన్నిటికి అనుసంధానంగా ఉండేలా రాజధాని ఉంటే అభివృద్ధి సులువుగా ఉంటుందని అమరావతిని ఎంపిక చేశారు చంద్రబాబు. ముఖ్యంగా మహానగరం హైదరాబాదు నీటి కష్టాలు అధిగమించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అది కూడా రెండు పురాతన మంచినీటి చెరువులు అందుబాటులో ఉన్నా కూడా చాలా సమయం పట్టింది. అలాంటిది 200 ఏళ్లపాటు భేషుగ్గా బతికేలా నిర్మించే నగరానికి నీటి వనరులు చాలా ఇంపార్టెంట్. అందుకే నదీ తీరం ఎంచుకుని, సలువుగా నగర విస్తరణ జరగడానికి అనుకూలంగా ఉండేలా రెండు చిన్న నగరా మధ్య స్థలాన్ని ఎంచుకుని భవిష్యత్తులో హైదరాబాదును మించిన మహానగరంగా అమరావతి ఎదగాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ వేశారు.

కానీ ... చంద్రబాబు మీద పగతో, తనను నిరంతరం ఆర్థిక నేరగాడు అంటూ విమర్శిస్తున్నాడన్న అక్కసుతో, కేవలం ఒక కులం మీద కోపంతో ఏకంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ అమరావతిని అంతం చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి పగబట్టినట్టు ప్రయత్నించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టాడు. అయితే, ఆరునెలలు తిరగకముందే అమరావతిని కాకుండా వేరే చోట సరయిన ఆప్షన్ ముఖ్యమంత్రి జగన్ కు కనపడలేదు. పైగా చేతిలో రొక్కం లేదు. బడ్జెట్ అనుమతించడం లేదు. చివరకు ఏపీ కోసం చంద్రబాబు కన్న కలను మోయక తప్పదని జగన్ కు అర్థమైంది. అందుకే చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు జగన్.

తన తప్పు తెలుసుకుని మధ్యలో ఆపేసిన అమరావతిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని రోడ్లు వేయండి. అమరావతిలో ఆగిన అన్ని పనులు మొదలుపెట్టండి. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వండి అంటూ రాత్రిపూట ఆదేశాల జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్. పోనీలే తప్పులు చేయడం కంటే చేసిన తప్పులు తెలుసుకోవడం, వాటిని దిద్దుకోవడంలో తప్పులేదు. ఇప్పటికైనా భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు, రాజధాని మనకూ ఓ ఇల్లుండాలని భావించిన లక్షలాది మంది సాధారణ ప్రజలకు జగన్ నిర్ణయం కాస్త ఊరటనిచ్చింది. కానీ ఆరునెలలు జగన్ ... రాజధానిని ఆపేసి వారిని పెట్టిన క్షోభకు పరిహారం ఇచ్చేది ఎవరు? ​