ప్రపంచ కుబేరుడు ఆయన కాదు.. ఇప్పుడెవరంటే?

August 03, 2020
CTYPE html>
ప్రపంచంలో అత్యధిక సంపన్నుడిగా అందరికి సుపరిచితుడైన అమెజాన్ కంపెనీ సీఈవో జెఫ్ బెజోస్ స్థానం కదిలింది. ఇప్పటివరకూ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఆయన స్థానంలోకి కొన్ని సంవత్సరాల పాటు ఎదురులేని రీతిలో మొదటి స్థానంలో కొనసాగిన అపర శ్రీమంతుడు.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మరోసారి మొదటిస్థానానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. అమెజాన్ షేర్లు పతనమైన నేపథ్యంలో.. వాటి మార్కెట్ విలువ మారటంతో బెజోస్ పీఠం కదిలింది.
మూడో త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్ భారీ నష్టాల్ని చవిచూసిన నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్ లో దాదాపు ఏడు శాతం మేర పడిపోయాయి. దీంతో.. 2017 తర్వాత తొలిసారి ఆయన కంపెనీ నికర ఆదాయంలో 26 శాతం తగ్గుదల నమోదైంది.
తాజా నివేదికల ప్రకారం బెజోస్ ఆస్తి 103.9 బిలియన్లు ఉండగా.. ఇప్పుడు ప్రధమ స్థానంలో నిలిచిన బిల్ గేట్స్ ఆస్తి 105.7 బిలియన్లకు చేరకుంది. 1987లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి స్థానం దక్కించుకున్న గేట్స్.. వరుస పెట్టి 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రాలేదు. అలాంటిది 2018లో బిల్ గేట్స్ ను పక్కకు నెట్టి ఆయన స్థానానికి చేరుకున్నా అమెజాన్ సీఈవో.
అయితే.. అమెజాన్ షేర్లు పతనం కావటం.. ఆయన భార్యతో చేసుకున్న విడాకుల ఒప్పందంలో భాగంగా దాదాపు 36 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను బదలాయించాల్సి రావటంతో బెజోస్ రెండో స్థానానికి చేరుకున్నారు.