అంబేద్కర్ విషయంలో జగన్ ఎందుకలా చేశారు

August 12, 2020

అమరావతి నుంచి రాజధాని మార్చడమే జగన్ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఇప్పటికే ఆయనపై అనేక విమర్శలున్నాయి.

ఆయన చేస్తున్న పనులు ఒక్కొక్కటి దానిని నిరూపిస్తూనే ఉన్నాయి.

అమరావతి పీక నులమడానికి రాజధాని అక్కడి నుంచి తరలించడానికి జగన్ సర్కారు చేయని ప్రయత్నం లేదు.

హైకోర్టు కనుక ఆపి ఉండకపోతే, కరోనా వచ్చుండకపోతే ఈ పాటికే అమరావతి నుంచి రాజధాని తరలివెళ్లేది. ఆ రెండింటి వల్ల ఆలస్యం అయ్యింది.

తాజాగా జగన్ అమరావతిలోకి మకుటాయమానంగా నిలిచే కట్టడాల్లో ఒకటైన అంబేద్కర్ స్మృతివనాన్ని అమరావతి నుంచి తరలించి విజయవాడ స్వరాజ్ మైదాన్ లో నిర్మించతలపెట్టారు.

బలహీన వర్గాలకు మాత్రమే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం అయిన అంబేద్కర్ విగ్రహాన్ని, ఆయన పేరుపై ప్రత్యేక పార్కును 125 ఎకరాల్లో భారీగా నిర్మించే దేశంలో దానిని ఒక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావించారు.

కానీ అంబేద్కర్ కు అంత స్థలం కేటాయించడం జగన్ కు ఇష్టం లేదేమో.. విజయవాడలో 20 ఎకరాలకు దానిని కుదించారు. 

ఇక మిడ్ నైట్ లో అన్ని పనులు చేసే జగన్ సర్కారు చివరకు ఈ శంకుస్థాపనను కూడా రాత్రిపూటే చేశారు.

20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటుకు వచ్చి స్వయంగా ప్రారంభించకుండా అంబేద్కర్ ను అవమానిస్తారా అంటూ తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు జగన్ ను విమర్శించారు. 

హడావుడిగా రాత్రికి రాత్రి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారో అక్కడే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతిలో జగన్ ని కట్టకపోతే  లేనిపక్షంలో రాష్ట్ర స్థాయి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు.