అమిత్ షా, మోడీ వెనక్కు తగ్గారు

August 05, 2020

ముస్లింలను ఏరివేయడానికే ఎన్సార్సీనీ తెచ్చారు అనే ఒక దుష్ర్పచారం కారణంగా కొన్ని రోజులుగా దేశంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాణాలు కూడా పోయాయి. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. దీనిని దేశ భద్రత కోణంలో కాకుండా చతికిల పడిన తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటోంది. 70 ఏళ్లపాటు మైనారిటీ రాజకీయాలన నడిపిన కాంగ్రెస్ మళ్లీ అదే సిద్ధాంతాన్ని ఇపుడు నెత్తిమీదకు ఎత్తుకుని ఎన్సార్సీతో పాటు సీఏఏ చట్టాన్ని కూడా అమలు చేయొద్దని డిమాండ్ చేస్తోంది. ఇంతవరకు తప్పులేదు. కానీ హింసకు కారణమయ్యేలా అందరినీ రెచ్చగొట్టి దేశంలో అల్లకల్లోలానికి కాంగ్రెస్ పరోక్షంగా కారణం అవుతోంది.

ప్రతి పదేళ్లకోసారి లెక్కించే జనాభా లెక్కలపై తాజాగా కేంద్రం ఓ ప్రకటన చేస్తే... దానిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నార్సీతో ముడిపెట్టింది. వాస్తవానికి ఎన్నార్సీ వేరు, ఎన్పీఆర్ వేరు. ఎన్నార్సీలో ప్రూఫ్స్ కావాలి. కానీ ఎన్.పి.ఆర్. ఏ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ లాగా వివరాలు చెబితే సరిపోతుంది. ఇదే విషయాన్ని నిన్న ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా వివరించారు. ఎన్నార్సీ, ఎన్ పీఆర్ రెండింటికీ సంబంధమే లేదన్నారు. 

ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా స్పస్టంగా చెప్పారు అమిత్ షా. పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలు ప్రచారమైపోయాయని... అందుకే ప్రధాని మోదీ చెప్పినట్టు ప్రభుత్వ ఎన్నార్సీని పక్కనపెట్టేసిందని చెప్పారు. ఎన్నార్సీ అధికారికంగా ఉపసంహరించుకుంటారా, లేదా  తాత్కాలిక మౌఖిక ప్రకటనమే మోడీషాలు పరిమితం అవుతారా అన్నది తెలియదు. కానీ ప్రస్తుతానికి వారిద్దరు ఎన్నార్సీని పక్కన పెట్టేశారు.