ఇర్ఫాన్ ఖాన్ గురించి అమిత్ షా... ఆసక్తికరం

August 05, 2020

బాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన నటుడు, హాలీవుడ్ సినిమాల్లో రాణించిన భారతీయ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం... దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ వార్త విన్న అభిమానులు నమ్మలేకపోయారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఇర్పాన్ తల్లి సయిదా 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో జైపూర్ లో మృతి చెందారు. ఆ తర్వాత వెంటనే నాలుగురోజులకే ఇర్ఫాన్ మరణించారు. లాక్ డౌన్ కారణంగా జైపూర్ లోని తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయారు. తల్లి మరణం పట్ల తీవ్రంగా రోధించారు. అయితే... మూడు రోజసులకే తాను అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరారు ఇర్ఫాన్. అతనికి ఇప్పటికే క్యాన్సర్ ఉంది. లండన్ లో చికిత్స తీసుకుని చాలావరకు కోలుకున్నారు. బుధవారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

ఇర్ఫాన్ మరణం పై ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. అయితే... తాజగా హోం మంత్రి అమిత్ షా ఇర్ఫాన్ కు నివాళులు అర్పిస్తూ... దేశం ఒక అద్భుతమైన వ్యక్తిని మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని కోల్పోయింది. సహృదయుడు అయిన ఇర్ఫాన్ అంతర్జాతీయంగా మెప్పుపొంది మనదేశానికి ఎంతో పేరు తెచ్చారు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. 

ఇర్ఫాన్ లాక్ డౌన్ కారణంగా మూడు సార్లు ఇబ్బంది పడ్డారు. మార్చి 13న అంగ్రేజీ మీడియం అని ఆయన సినిమా విడుదల కాగా లాక్ డౌన్ తో సినిమా ప్రదర్శన ఆగిపోయింది. కేవలం వారం రోజులే థియేటర్లే ఆ సినిమా నిలిచింది. ఆ తర్వాత ఇదే లాక్ డౌన్ లో తల్లిని కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తాజాగా విధి ఆయననే బలితీసుకుంది.