అమితాబ్ కి కరోనా ... చిరంజీవి, నాగార్జున ఏమన్నారంటే

August 04, 2020
CTYPE html>
బాలీవుడ్ లో  ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు.  శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఈ విషయం వెలుగుచూసింది. వెంటనే అమితాబ్ ను ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేర్చారు.
ఈ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్, టాలీవుడ్ షాక్ కి గురైంది. 77 ఏళ్ల అమితాబ్ కరోనా సోకడంతో అందరూ అతని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. అయితే, వయసు మళ్లిన వారు కూడా ఎంతో మంది కోలుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
 
ఈ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీరు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తారు. మేమంతా మీకోసం ప్రార్థిస్తాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. నాగార్జున అక్కినేని కూడా మీ ఆరోగ్యం కోసం మేము ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.
 
ఇదిలా ఉండగా...  తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అమితాబ్ స్వయంగా  ట్విట్టరులో తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారని అమితాబ్ ప్రకటించారు. ఇంట్లో వారికి టెస్టులు చేయడానికి శాంపిల్స్ సేకరించారు. ఆ ఫలితాలు ఇంకా రాలేదు. తనను పది రోజులుగా కలిసిన వాళ్లకు టెస్టులు చేయమని ప్రభుత్వాన్ని అమితాబ్ కోరారు. ఇద్దరికీ మైల్డ్ సింప్టమ్స్ ఉండటం... ఆశాజనకం.
 
దేశంలో ముంబైలో కరోనా తీవ్ర అత్యధికంగా ఉంది. కేసులు భారీగా పెరగడమే కాకుండా మహారాష్ట్రలో వ్యాపించిన స్ట్రెయిన్ చాలా స్ట్రాంగ్. మరణాలు కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. దీంతో అమితాబ్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు కరోనా బారిన పడినా... వారందరి వయసు తక్కువ. కానీ అమితాబ్ కు 77 ఏళ్లలో సోకడమే ఇపుడు భయానికి కారణం.