మోడీపై ప్రియాంక గడుసు సెటైర్

July 13, 2020

ఏ మాటకు ఆ మాటే. ప్రియాంక వచ్చాక కాంగ్రెస్ లో జోష్ బాగా పెరిగింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి మోడీని ప్రియాంక ఒక ఆట ఆడుకుంటోంది. జనరంజకమైన సెటైర్లు వేస్తూ మోడీ అసలు రూపాన్ని జనాలకు వివరించడానికి తనదైన ప్రయత్నం చేసింది.
మోదీ కంటే అమితాబ్ బచ్చన్ ప్రధాని అయ్యుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడింది. చివరి దశ ఎన్నికల ప్రచారం ఈరోజు ముగుస్తోంది. ప్రియాంక ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ప్రచారం నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రపంచంలో ఉత్తమ నటుడిగా మోడీని ఆమె కీర్తించారు. మనం ఒక పొరపాటు చేశాం. అదే మోడీని ఎన్నుకోవడం. వాస్తవానికి మనం అమితాబ్ బచ్చన్ ని ప్రధాని ఎన్నుకుని ఉంటే మోదీ కంటే ఆయన కొంచెం బెటర్ గా ఉండేవారు. కాకపోతే ఆయన కూడా ఏమీ చేసేవారు కాదనుకోండి... అంటూ వ్యంగాస్త్రాలు వేశారు.
మీర్జాపూర్ ప్రజలను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పెద్ద నోట్ల రద్దు చేసినపుడు ఎవరైనా బీజేపీ నేతలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డారు. దాన్ని బట్టి వారి అరాచకాలు ఎన్నో అర్థం చేసుకోండి అన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. రైతుల అయితే నాశనం అయ్యారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని బీజేపీ నేతలు గత ఎన్నికల్లో చెప్పిన కబుర్లు గుర్తున్నాయా? తీరా వారి నిర్వాకం వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 12,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రధాని కనీసం ఐదు నిమిషాలు కూడా రైతుల కోసం కేటాయించలేదు. భారతదేశపు వెన్నెముక అయిన రైతును బీజేపీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.