KRKR: వర్మకు మళ్లీ గాటు పెట్టిన హైకోర్టు

February 23, 2020

రెండు కులాల పేరుతో జనాల్లో కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే.. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైలెంటుగా ఉన్నారు. చివరకు ఓ సామాన్యుడు దీనిపై కోర్టుకు వెళ్లడంతో వర్మ అతికి, ఆయన సినిమాకు రెండింటికీ బ్రేక్ పడింది. మొన్ననే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా... సెన్సార్ సర్టిఫికెట్ రాకముందే విడుదల తేదీ ప్రకటించడంతో మరోసారి కోర్టు సీరియస్ అయ్యింది. దీంతో ఈరోజు వర్మతోపాటు సెన్సార్ సభ్యులు కూడా కోర్టులో హాజరయ్యారు.

చివరకు అభ్యంతరకరమైన సన్నివేశాలన్నీ తొలగించడానికి వర్మ అంగీకరించారు. krkr గా పెట్టిన ఈ సినిమా టైటిల్ ను కోర్టు ఆదేశాలతో అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అని వర్మ మార్చేసిన విషయంతెలిసిందే. చివరకు కోర్టు దెబ్బకు టీడీపీని బాబుని టార్గెట్ చేసిన సన్నివేశాలకు కత్తెర పడటంతో వర్మ ప్రయత్నం నిష్ఫలమైంది. రాష్ట్రంలో కుల చిచ్చు పెచ్చరిల్లకుండా కోర్టు ఓ కుట్రను చేదించినట్టయ్యింది. 

సన్నివేశాల తొలగింపు హామీని మాత్రమే విని కోర్టు సంతృప్తి చెందలేదు. రేపు తొలగించిన సన్నివేశాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రేపు మళ్లీ దీని గురించి కోర్టులో విచారణ జరగనుంది.