అఫిషియల్ : ప్రభుత్వ స్కూళ్లకు మరణ శాసనం

June 01, 2020

అమ్మఒడి పథకంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొన్ని రోజుల నుంచి ఈ పథకం ప్రైవేటు స్కూళ్లకు వర్తిస్తుందా? లేదా అన్న అనుమానాలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి క్లారిటీ ఇచ్చింది. ఏ స్కూల్లో చదివినా పేదలకు ఈ పథకం వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
తాజా ప్రభుత్వ నిర్ణయంతో కొన ఊపిరితో నడిచే ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలకు కూడా ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. గవర్నమెంటు బడుల్లో చదివేది ప్రస్తుతం నిరుపేదల పిల్లలే. ఈ పథకం వల్ల వారి చేతికి డబ్బులు వస్తే ఆ పిల్లలు కూడా ప్రైవేటు స్కూళ్ల వైపే మొగ్గు చూపుతారు. దీంతో ప్రభుత్వ బడుల్లో చేరికలు విపరీతంగా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఓ వైపు రెండేళ్లలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పిన జగన్ మొత్తానికి వాటిని మూసివేసే పరిస్థితికి తెచ్చేలా ఉన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాట్ల కంటే టీచర్ల చిత్తశుద్ధి ముఖ్యం. ఈ నేపథ్యంలో టీచర్ల లో బాధ్యత పెంచే నిర్ణయాలు తీసుకుని, వసతులు కల్పిస్తే తప్ప ప్రభుత్వ బడులు నిలబడే పరిస్థితులు లేదు. కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగులను వేధించను అని చెప్పిన వారిలో బాధ్యతను పెంచగలరా? ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దగలరా? లేకపోతే అమ్మఒడితో ఆ గవర్నమెంటు స్కూళ్లకు మరణ శాసనం రాస్తారా? కొన్ని నెలలు గడిస్తే ఇది స్పస్టం అవుతుంది.