మొదటి సినిమా రిలీజ్ కాలేదు.. రెండోది ఫిక్స్!

February 24, 2020

ఎంత న‌ట‌వార‌సుల‌కైనా కొన్ని లిమిటేష‌న్స్ కు మామూలే. తొలి సినిమా రిలీజ్ అయ్యాక‌.. దాని ఫ‌లితం చూశాక సినిమాలు రావ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. కానీ.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండది.
అన్న‌కున్న అద్భుత‌మైన ఫాలోయింగ్ తో త‌మ్ముడికి దొర‌సాని మూవీలో అవ‌కాశం ద‌క్క‌టం తెలిసిందే. ఈ మూవీ ఈ వారం విడుద‌ల కానుంది. అయితే.. త‌న తొలి సినిమా రిలీజ్ కు ముందే.. రెండో సినిమా కొబ్బ‌రికాయ కొట్టే డేట్ ఫిక్స్ చేసిన ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు.
త‌న త‌ర్వాతి సినిమా కోసం ఇప్ప‌టికే రెండు క‌థ‌లు విన్న‌ట్లు ఆనంద్ దేవ‌ర‌కొండ చెప్పాడు. ఆ రెండింటిలో వినోద్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీని ఓకే చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆగ‌స్టులో త‌న రెండో సినిమాను స్టార్ట్ చేయాల‌నుకున్న‌ట్లు తెలిపారు. దొర‌సాని క‌థ‌ను ఓకే చేశాక నిర్మాత‌లు త‌న‌కు పూర్తి ఫ్రీడ‌మ్ ఇచ్చి బాధ్య‌త‌ను మ‌రింత పెంచిన‌ట్లు చెప్పారు.
అన్న‌య్య‌కు.. త‌న‌కు ఉన్న కామ‌న్ పాయింట్లు చెప్పుకొచ్చారు.
అన్న‌కు.. త‌న‌కు సినిమాలంటే పిచ్చి అని.. నాన్న టీవీ షోలు.. సీరియ‌ల్స్ డైరెక్ట్ చేసేశార‌న్నారు. స్కూల్ డేస్ నుంచి అన్న క‌థ‌లు రాసేవాడ‌న్నారు. విజ‌య్ కాని యాక్ట‌ర్ కాకుంటే డైరెక్ట‌ర్ అయ్యేవార‌న్నారు. త‌న‌కు ఏదైనా పాత్ర సూట్ అవుతుంద‌ని త‌న అన్న‌కు అనిపించి.. త‌న‌ను చేయ‌మ‌ని స‌ల‌హా ఇస్తే మాత్రం తాను త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెప్పి.. అన్న మీద త‌న‌కున్న న‌మ్మ‌కాన్ని చెప్పేశారు.