అనంతపురం ఎన్నికలు హింసాత్మకం

June 30, 2020

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల్లో రక్తం చిమ్మింది. ఈ నియోజకవర్గంలోని మీరాపురంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి, టీడీపీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి చనిపోయారు. వైసీపీకి చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నాన్ లోకల్ ఓటరు ఒకరు ఓటు వేసేందుకు వచ్చారని ఒక పార్టీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఆ ఓటరుకు మద్దతుగా మరో పార్టీ కార్యకర్తలు నిలిచారు. ఇది ఘర్షణకు దారితీసింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. అక్కడ టీడీప-వైసీపీ మధ్యన పరిస్థతి ఉద్రిక్తంగా ఉంది. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది.