​రెచ్చిపోయిన అనసూయ... ఎవడ్రా నువ్వు నా డ్రెస్ గురించి మాట్లాడుతావు?

August 09, 2020

అనసూయ కు నచ్చని ఒకే ఒక సబ్జెక్టు విమెన్ డ్రెస్సింగ్. ఇప్పటికే అనేక సార్లు తన డ్రెస్ గురించి మాట్లాడిన వారికి వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఆమె నిన్న పుట్టిన రోజు వేసుకున్న డ్రెస్ అభ్యంతరకరంగా ఉందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల తల్లివి ఇలాంటి డ్రెస్సా వేసుకునేది అని ప్రశ్నించాడు. అంతే అనసూయకు కోపం నషాళానికి అంటింది. ఎవడ్రా నువ్వు నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో చెప్పడానికి అని ఏకి పడేసింది.

పుట్టిన రోజు సందర్భంగా అనసూయ కీసరలో వందమంది గర్భిణీ స్త్రీలకూ పౌష్టికాహారం అందించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ నేపథ్యంలో అందరు అనసూయకు విషెస్ చెప్పారు. ఒక వ్యక్తి డిజైనర్ వేర్ వేసుకున్న అనసూయను డ్రెస్సింగ్ గురించి నిలదీశాడు. ‘‘నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి ఆ డ్రస్ ఏంటి..? కొంచం పద్దతిగా ఉండొచ్చుకదా !' అన్నాడు. అనసూయ కోపం కట్టలు తెంచుకుంది.

అమ్మ అయితే... నాకు నచ్చినట్టు నేను డ్రెస్ వేసుకుంటా? అమ్మ అయితే ఇలానే వేసుకోవాలి అని ఏమైనా ఉందా? ఆ డ్రస్ వేసుకోవాలి ఈ డ్రస్ వేసుకోకూడదు అని రూల్స్ ఉన్నాయా? అసలు తల్లి గురించి నీకేం అర్హత ఉందిరా అంటూ మండిపడింది. నా పుట్టిన రోజున నాతో తిట్లు తినాలనుకున్నావా అంది. అమ్మ ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవడివిరా..' అంటూ కోపగించుకుంది. అనంతరం ఇతర నెటిజన్లు సారీ గైస్.. ఇలాంటి కొందరిని క్షమించకూడదు అని చెప్పింది.