అనసూయది పాత పగ? - ఆడుకున్న నెటిజన్లు

August 07, 2020

కరోనా వచ్చిన మొదట్లో షూటింగ్ లు బ్యాన్ చేసినపుడు పనులు ఆపేస్తే మాలాగ రోజు ఆదాయం మీద బతికేటోళ్లు ఎలా బతుకుతాం సార్ అని ట్వీట్ వేసిన అనసూయను అప్పట్లో అందరూ అడ్డంగా ఆడుకున్నారు. ‘‘బుద్ధందా నీకు ప్రజల ప్రాణాలు పోతుంటే పేదలకు కూడా ఉపాధి పోయినా లాక్ డౌన్ కి మద్దతు పలుకుతున్నారు... నువ్వు రోజుకి లచ్చ సంపాదిస్తూ ఎలా బతకాలి అంటావా’’ అంటూ మాటలతో దాడి చేశారు. దీంతో దెబ్బకు సైలెంట్ అయ్యింది అనసూయ. 

ఆ తర్వాత అందరూ విరాళాలు ఇస్తున్నారు అనసూయ ఆంటీ మాత్రం విరాళాలు ఇవ్వదట... ఏం ఆంటీ వద్ద డబ్బుల్లేవా అంటూ సెటైర్లు వేశారు. అయితే... ఇలాంటివి అనసూయ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటుంది. ఇలాంటివి పట్టించుకుంటే టైం వేస్టు, మరింత బ్యాడ్ అవడం తప్ప ఉపయోగం లేదని గుర్తించిన తెలివైన యాంకర్.. అనసూయ. అయితే అవి చిన్న విషయాలు కాబట్టి సరిపోయింది.

తాజాగా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తున్న వెబ్ సైట్ల గురించి #KillFakeNews అంటూ ఉద్యమం మొదలుపెట్టారు. దీనికి మెగాస్టార్, సూపర్ స్టార్లు అంతా మద్దతు పలికారు. అయితే... అనవసరంగా దీంట్లో వేలు పెట్టి అనసూయ బుక్కైపోయింది.

తనదాకా వస్తే గాని కొందరికి తెలియదు అని తన ట్విట్టరులో కామెంట్ చేసింది. ఇది విజయ్ గురించే అని భావించిన అభిమానులు అనసూయను వాయించేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ వీరికి తోడయ్యారు. ఇంటర్నెట్లో, ఇండస్ట్రీలో పాపులర్ అయిన మహేష్, విజయ్ దేవరకొండ జోలికి పోవడంతో అనసూయను అనేక మంది తీవ్రపదజాలంతో విమర్శిస్తున్నారు. 

అనసూయ ఇలా ఎందుకు చేసిందా అని ఆరాతీస్తే... ముందునుంచీ ఈమె విజయ్ టీం పట్ల వ్యతిరేకతతోనే ఉన్నట్టుంది. అర్జున్ రెడ్డి విడుదల సమయంలో హీరో, దర్శకులపై విమర్శలు చేసింది. ఆ సినిమాలో సీన్లను కొన్నిటిని ఆమె వ్యతిరేకించింది. అపుడు కూడా అనసూయను చాలామంది తిట్టిన వారు కూడా ఉన్నారు. అది మనసులో పెట్టుకుని ఇలా చేసిందేమో అని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అయితే... నెటిజన్లు వాళ్ల తిట్లు ామామూలే... ఈ టైంలో మనం కామెంట్ చేస్తే పాపులర్ అవుతామన్న చీప్ ట్రిక్స్ తో కూడా ఆమె ఇలా చేసి ఉండొచ్చని కొందరంటున్నారు.