అనసూయ లేని జబర్దస్తా... షాక్

May 27, 2020

జబర్దస్త్ సక్సెస్ కు కారణం కేవలం అందులోని కామెడీ మాత్రమే కాదు, యాంకర్ల ఒంపు సొంపులు, జడ్జిల నవ్వులు. కాబట్టి ఇందులో ఏది మిస్సయినా జబర్దస్త్ కొంచెం కళ తప్పుతుంది. తాజాగా జబర్దస్త్ గురించి ఓ బ్రేకింగ్ న్యూస్ తెలుస్తోంది. యాంకర్ గా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ జబర్దస్త్ ఛాన్స్ వల్ల టాప్ రేంజికి వెళ్లిపోయింది. హీరోయిన్ల కంటే కూడా సోషల్ మీడియాలో ఆమెకే ఎక్కువ క్రేజుంది. అక్కడ తన కళా ప్రదర్శనతో అందరికీ పాపులర్ అయిన అనసూయకు చాలా షోలలో ఆఫర్లు వచ్చాయి. అనంతరం సినిమాల్లో మంచి ఛాన్సులు వచ్చాయి. ప్రధాన పాత్రలు ఆమెకు దక్కాయి. సుకుమార్ వంటి దర్శకుడు కీలక పాత్రను ఆమెకు ఇవ్వడం సాధారణమేమీ కాదు. ఎన్ని చేసినా ఆమె తన కెరీర్ నిలబెట్టిన జబర్దస్త్ కు దూరం కాలేదు. కానీ ఆ రోజు తొందరలో వచ్చేలా కనిపిస్తోంది.

అనసూయ త్వరలోనే జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనుందని ప్రచారం జరుగుతోంది. అనసూయ ప్రధాన పాత్రలో ‘కథనం’ సినిమా తెరకెక్కింది. రంగస్థలం, యాత్ర వంటి పెద్ద సినిమాల్లోనూ మంచి పాత్రలు చేసిన అనసూయకు తాజాగా వరుసగా సినిమా అవకాశాలు రావడంతో జబర్ధస్త్‌ ప్రోగ్రాంకు టైం సరిపోవడం లేదట. దీంతో తాత్కాలికంగా జబర్దస్త్ ప్రోగ్రాంకు కాస్త విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది జరిగితే జబర్దస్త్ అభిమానులకు, అనసూయ అభిమానులకు భారీ నిరాశ తప్పదు. ఇక హైపర్ ఆది బాధను అయితే ఎవరూ తీర్చలేరు.