మీడియాకు లేఖ రాసిన జబర్దస్త్ అనసూయ

May 26, 2020

ఒక జర్నలిస్టుగా తన ప్రస్తానం మొదలుపెట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో హాట్ యాంకర్ గా, ప్రముఖ సహ నటిగా పేరుపొందిన అనసూయ మీడియాకు బహిరంగ లేఖ రాశారు. బంజారాహిల్స్ లోని నా ఇంట్లో జీఎస్టీ, ఐటీ రైడ్లు జరిగినట్లు అన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయని... మీడియా గెస్ చేసి వార్తలు రాసేశారని, కానీ నా ఇల్లు బంజారాహిల్స్ లో లేదు, నా ఇంటికి ఎవరూ అధికారులు కూడా రాలేదని ఆమె మీడియాకు లేఖలో తెలిపారు. కచ్చితమైన సమాచారంతో వార్త రాయాలి గాని... కొందరి ఇళ్లలో దాడులు జరిగాయి అని గెస్ చేసి మీకు తోచిన పేర్లు రాసేయడం కరెక్టు కాదని ఆమె అన్నారు. ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి సంపాదించుకని పేరుని, జీవితాన్ని దయచేసి మీ అర్థసత్య వార్తలతో నాశనం చేయొద్దంటూ ఆమె మీడియాను వేడుకున్నారు. మీడియా పవర్ ఫుల్ హౌస్. సరైన సమాచారం ఇచ్చి నలుగురికి మంచి చేయండి. కానీ ఎవరిని డ్యామేజ్ చేయకండి అంటూ ఆమె కోరారు. 

ఆమె తన లేఖను ట్విట్టరులో పెట్టారు. దానిని కింద మీరు చదవొచ్చు.